Breaking News

కాలేయ రోగుల్లో ఎండీఆర్‌ ఇన్ఫెక్షన్‌

Published on Fri, 12/12/2025 - 02:29

సాక్షి, హైదరాబాద్‌: కాలేయ మార్పిడి రోగుల్లో సగం మందికిపైగా మల్టీ డ్రగ్‌ రెసిస్టెన్స్‌ (ఎండీఆర్‌) ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు హైదరాబాద్‌కు చెందిన సౌత్‌ ఏసియన్‌ లివర్‌ ఇన్‌స్టిట్యూట్‌ తాజా అధ్యయనం వెల్లడించింది. 26 నెలలపాటు జరిగిన ఈ అధ్యయనంలో 67 మంది కాలేయ శస్త్రచికిత్స రోగులను పరిశీలించారు. వారిలో 24 శాతం మందిలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను గుర్తించారు. 46 మంది కాలేయ మార్పిడి పొందిన రోగుల్లో 16 మందికి ఇన్ఫెక్షన్లు విస్తరించగా వారిలో 94% మందికి తొలి, రెండో దశ యాంటీబయోటిక్స్‌ కూడా పనిచేయలేదని నివేదిక తెలిపింది.

ఇన్ఫెక్షన్‌ కేసుల్లో 56 శాతం మందికి శస్త్రచికిత్సకు ముందే రక్త నమూనాల్లో ఎండీఆర్‌ బాక్టీరియా కనిపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. రోగుల్లో సగానికిపైగా ఎండీఆర్‌ ఇన్ఫెక్షన్‌తో వస్తే ఆసుపత్రుల్లో అందించే ఇన్ఫెక్షన్‌ నిరోధక చర్యలు పనిచేయవని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ టామ్‌ చెరియన్‌ పేర్కొన్నారు. శస్త్రచికిత్సకు ముందు రోగులలోని క్రియాశీల ఇన్ఫెక్షన్లను గుర్తించి నియంత్రించడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.

తీవ్ర స్థాయిలో యాంటీబయోటిక్‌ రెసిస్టెన్స్‌ 
తాజా అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం భారత్‌లోని రోగుల్లో 80 శాతం మందిలో ఎండీఆర్‌ సూక్ష్మజీవులు ఉన్నాయని వెల్లడైంది. ప్రప్రంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) జీఎల్‌ఏఎస్‌ఎస్‌–2025 నివేదికలో భారత్‌లో ప్రతి మూడు బాక్టీరియా ఇన్ఫెక్షన్లలో ఒకటి సాధారణ యాంటీబయోటిక్స్‌ను ప్రతిఘటిస్తున్నట్లు తేలింది. 

బ్యాక్టీరియా కల్చర్‌లను ముందుగానే నిర్వహించడం వల్ల శస్త్రచికిత్సల సమయంలో 30 శాతం మందికి ఇన్ఫెక్షన్‌ వచ్చినా సరైన యాంటీబయోటిక్స్‌తో సమస్యను నియంత్రించగలిగామని సౌత్‌ ఏసియన్‌ లివర్‌ ఇనిస్టిట్యూట్‌ వైద్యులు చెబుతున్నారు. భారత్‌లో జరుగుతున్న తాజా అధ్యయనాల ప్రకారం చివరి దశలో వాడే ‘కార్బాపెనమ్‌’ యాంటీబయోటిక్స్‌కే రెసిస్టెన్స్‌ పెరుగుతోందని తేలింది. ఇందులో ఇ.కోలికి 22 శాతం, కె.నిమోనియాకు 31 శాతం రెసిస్టెన్స్‌ ఎదురైనట్లు తేలింది. 

ద్వితీయశ్రేణి నగరాల్లో స్క్రీనింగ్‌ తప్పనిసరి
నిపుణుల సూచన ప్రకారం సెమీ–రూరల్, ద్వితీయశ్రేణి నగర ప్రాంతాల్లో ప్రీ–ఆపరేటివ్‌ స్క్రీనింగ్‌ విధానాలు తప్పనిసరి చేయడం ద్వారా మల్టీ డ్రగ్‌ రెసిస్టెన్స్‌ను గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే యాంటీబయోటిక్స్‌ వినియోగం, పర్యవేక్షణ వ్యవస్థల బలోపేతం అత్యవసరమని సూచించారు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)