Breaking News

Mastan Sai Case: 44 మంది యువతులు, 250కి పైగా వీడియోలు 

Published on Sat, 02/15/2025 - 08:55

మణికొండ: నగ్న వీడియోలు, బ్లాక్‌మెయిలింగ్, డ్రగ్స్, అత్యాచారం, హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్‌సాయిని కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు. రెండో రోజు శుక్రవారం క్రైం పోలీసులతో పాటు సైబరాబాద్‌ నార్కొటిక్స్‌ విభాగం సైబరాబాద్‌ ఇన్‌చార్జి హరిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు అతడిని విచారించారు. ఈ సందర్భంగా మస్తాన్‌సాయిని డ్రగ్స్‌ ఎక్కడి నుంచి తెప్పిస్తావు, ఎంత మందికి ఇచ్చావు,  డ్రగ్స్‌ అలవాటు చేసిన యువతులపై ఎందుకు అత్యాచారం చేశావని, అలా ఎంత మందిని చేశావు, నగ్న వీడియోలను తీయాల్సిన అవసరం ఏమిటని, లావణ్యను ఎందుకు హత్య చేయాలనుకున్నావని ప్రశ్నించినట్లు తెలిసింది.

 తన హార్డ్ డిస్క్లో లావణ్య ఆరోపించినట్లు వేల సంఖ్యలో వీడియోలు లేవని, తన భార్యతో పాటు ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌వి మాత్రమే ఉన్నాయని మరోసారి బుకాయించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. దాంతో హార్డ్‌డెస్‌్కను అతడి ముందే ఓపెన్‌ చేసిన  పోలీసులు అవాక్కయ్యారు. అందులో ఒక్కో యువతికి సంబంధించి ఒక్కో ఫోల్డర్‌ రూపంలో వాట్సాప్‌ చాట్స్, ఆడియో, వీడియో, స్క్రీన్‌ రికార్డింగ్‌లను భద్రపర్చినట్లు పోలీసులు గుర్తించారు. హార్డ్‌డిస్‌్కలో 44 మంది యువతులకు సంబందించి 250కి పైగా వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. తన విల్లాలోని బెడ్‌రూంలో సీక్రెట్‌గా ఏర్పాటు చేసిన ఐదు కెమెరాలతో వీటిని తీసినట్లు విచారణలో మస్తాన్‌సాయి అంగీకరించినట్టు సమాచారం. 

లావణ్య ఇంట్లోనూ  తీసిన వీడియోలు, చాట్‌ డాటా అతడి సెల్‌ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటి ఆధారంగా అతడిని ప్రశ్నించినట్లు తెలిసింది. తన మిత్రుడు వినీత్‌రెడ్డి తనకు డ్రగ్స్‌ సరఫరా చేసే వాడని, పార్టీలు ఉన్నపుడు అతడి వద్ద కొనుగోలు చేసే వాడినని మస్తాన్‌సాయి వెల్లడించినట్లు సమాచారం. దీంతో వినీత్‌రెడ్డిని అరెస్టు చేసి, మరోమారు విచారించాలని నార్కోటిక్స్‌ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. 

రెండో రోజు విచారణలో మస్తాన్‌సాయి యువతులను డ్రగ్స్‌ పార్టీల ద్వారా మచి్చక చేసుకుని వారిని లైంగికంగా వాడుకున్నానని అంగీకరించినట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం  వరకు పోలీసులు అతడి మరింత లోతుగా విచారించనున్నారు. అప్పటికీ తమకు రావాల్సిన సమాచారం రాకపోతే శనివారం  మరో సారి కస్టడీ పిటిషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.  

రాజ్ తరుణ్‌ కాళ్లు పట్టుకుంటా: లావణ్య


 

 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)