Hyderabad: అపార్టుమెంట్‌లో భారీ చోరీ

Published on Wed, 07/31/2024 - 07:36

బన్సీలాల్‌పేట్‌: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఓ అపార్టుమెంట్‌లో దొంగలు పడ్డారు. సుమారు 40 తులాల బంగారం, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లిన ఘటన గాందీనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌ భోలక్‌పూర్‌ కృష్ణానగర్‌ కాలనీలోని భవానీ శ్రీ షీలా ఎవెన్యూ అపార్టుమెంట్‌ 3వ అంతస్తులోని 303 ఫ్లాట్‌లో మాదాపూర్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఉద్యోగి శ్రీనివాస్, ఆయన భార్య సబిత, ఇంజినీరింగ్‌ చదువుతున్న కుమార్తె అనుష్కతో కలిసి నివసిస్తున్నారు. 

మంగళవారం ఇంటికి తాళం వేసి సబిత బయటకు వెళ్లారు. కుమార్తె కాలేజీకి, శ్రీనివాస్‌ బ్యాంక్‌కు వెళ్లారు. మధ్యాహ్నం వేళ గుర్తు తెలియని దొంగలు అపార్టుమెంట్‌ మూడో అంతస్తులోకి ప్రవేశించారు. తాళం వేసిన గడియ కింది భాగాన్ని తొలగించి ఇంట్లోకి వెళ్లారు. 

అల్మరా, ఇతరత్రా ప్రదేశాల్లో దాచి ఉంచిన 14 తులాల బంగారం, రూ.లక్ష నగదును దొంగిలించారు. శ్రీనివాస్‌ కుమార్తె అనుష్క సాయంత్రం కాలేజీ నుంచి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో సామాన్లు చిందరవందరగా పడి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా గాంధీనగర్‌ డివిజన్‌ ఏసీపీ మొగులయ్య, ఇన్‌స్పెక్టర్‌ డి.రాజు ఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. తెలిసిన వ్యక్తులే చోరీకి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)