Breaking News

నగరంలో మహిళ దారుణ హత్య

Published on Sat, 03/29/2025 - 09:41

నిజామాబాద్‌ రూరల్‌: నగరంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. నిందితుడు మృతదేహాన్ని కారులో   తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రూరల్‌ సీఐ సురేష్‌  ఎస్‌హెచ్‌వో ఆరీఫ్‌ తెలిపిన వివరాలు ఇలా.. కంఠేశ్వర్‌ బైపాస్‌ నుంచి దాస్‌నగర్‌ కెనాల్‌ కట్టవైపు వెళుతున్న ఓ కారు సిగ్నల్స్‌ వద్ద ఆపకపోవడంతోపాటు, కారు డిక్కీలోని కవర్‌ బయటకు కనబడటంతో పోలీసులకు అనుమానం వచ్చి వెంబడించారు. 

మాక్లూర్‌ పోలీసులు కారును ఆపగా, డిక్కీలో మహిళ మృతదేహం ఉండటంతో రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని నిందితుడు రాజేష్‌ ను అదుపులోకి తీసుకొని వివరాలు తెలుసుకున్నారు. మృతురాలు ముబారక్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన బింగి కమల(46)గా గుర్తించారు. ముబారక్‌ నగర్‌కు చెందిన రాజేష్‌ వాళ్ల అమ్మకు అదేప్రాంతానికి చెందిన కమల చెడు వ్యసనాలు అలవాటు చేస్తోంది. దీంతో ఆగ్రహించిన రాజేష్‌ గురువారం కమలను కంఠేశ్వర్‌ బైపాస్‌ లోపలికి తీసుకెళ్లాడు. 

ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగగా రాజేష్‌ కమలను బండరాయితో మోదీ హత్య చేశాడు. శుక్రవారం ఉదయం మృతదేహాన్ని కాలువలో పడేయడానికి కారు డిక్కీలో పెట్టి బయలుదేరాడు. మృతదే హానికి కప్పిన కవర్‌ బయటకు రావడం, సిగ్నల్స్‌ వద్ద కారు ఆపకపోవడంతో పోలీసులు అనుమానం వచ్చి అతడిని పట్టుకున్నారు. మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.  

పాంగ్రాలో మరో మహిళ..
ఖలీల్‌వాడి: నగరంలోని పాంగ్రా కల్లుబట్టి సమీపంలో ఓ మహిళ హత్యకు గురైంది. సీఐ శ్రీనివాసురాజు తెలిపిన వివరాలు ఇలా.. పాంగ్రా కల్లుబట్టి సమీపంలోని ఇంట్లో నివాసముంటున్న చంద్రకళ(50)కు తన కూతురు మౌనిక నాలుగు రోజులుగా ఫోన్‌ చేసిన స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన మౌనిక శుక్రవారం ఇంటికి వచ్చి చూడగా చంద్రకళ హత్యకు గురైనట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు, ఈనెల 23న ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులు మహిళ ఒంటిపై ఉన్న బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారురు. పోలీసులు పలువురు యువకులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు