Breaking News

మాకు ఇక దిక్కెవరమ్మా..!

Published on Wed, 09/24/2025 - 11:03

యాదాద్రి భువనగిరి జిల్లా: ఇంట్లో చీరతో ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో మంగళవారం జరిగింది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రానికి చెందిన రామసాని అనిల్‌రెడ్డికి చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన అక్షయ(32)తో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అక్షయ హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుంది. మంగళవారం ఉదయం అక్షయ తనకు తలనొప్పిగా ఉందని, బయట టీ స్టాల్‌ నుంచి టీ తీసుకురమ్మని భర్తకు చెప్పి పంపించింది.

 ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో అక్షయ బెడ్‌రూంలో వెంటిలేటర్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇంటికి వచ్చేసరికి అక్షయ ఉరికి వేలాడుతూ కనిపించడంతో చుట్టుపక్కల వారికి విషయం చెప్పాడు. వారు వచ్చి అక్షయను కిందికి దింపి చూడగా అప్పటికే మృతిచెందింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

 మృతురాలి భర్త అనిల్‌రెడ్డిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పిసాటి సావిత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కె. భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే భార్యాభర్తల మధ్య గత ఆరు నెలలుగా కలహాలు మొదలయ్యాయని, ఈ క్రమంలోనే భర్త అనిల్‌రెడ్డే అక్షయను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆమె తరఫు బంధువులు ఆరోపించారు. కాగా ఇరుపక్షాల పెద్దమనుషులు కూర్చొని మృతురాలి ఇద్దరు పిల్లల పేరిట రూ.5లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయడంతో పాటు స్థిరాస్తినంతా పిల్లలకు రాసిచ్చేలా ఒప్పందం చేసుకున్నారని తెలిసింది.  

Videos

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)