Breaking News

‘నా వద్దకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’

Published on Tue, 07/01/2025 - 10:03

నేరేడుచర్ల(నల్గొండ): ప్రియుడికి వీడియో కాల్‌ చేస్తే స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై ఉరేసుకున్న వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఆమె మృతికి ప్రియుడే కారణమని మృతదేహాన్ని అతడి ఇంటి ముందు ఉంచి మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం రాత్రి ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం బోడలదిన్నె గ్రామానికి చెందిన మల్గిరెడ్డి అశ్విని(35) తన భర్తతో కలిసి గత మూడేళ్లుగా హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో నివాసముంటోంది. వీరికి ఒక కుమార్తె సంతానం. బోడలదిన్నె గ్రామానికే చెందిన కందుకూరి సురేష్‌రెడ్డి కూడా ఎల్‌బీనగర్‌లోనే ఉంటున్నాడు. 

ఈ క్రమంలో అశ్విని, సురేష్‌రెడ్డి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల అశ్విని, సురేష్‌రెడ్డి మధ్య దూరం పెరగడంతో.. నాలుగు రోజుల క్రితం అశ్విని సురేష్‌రెడ్డికి వీడియో కాల్‌ చేసి ‘నా వద్దకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’ అని చెప్పింది. దీనికి తాను రానని సురేష్‌రెడ్డి సమాధానం చెప్పడంతో మనస్తాపానికి గురైన అశ్విని తాను ఉంటున్న ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత అనుమానం వచ్చి సురేష్‌రెడ్డి అశ్విని ఇంటికి వెళ్లగా ఆమె ఆపస్మారక స్థితిలో ఉండటం చూసి సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. 

మృతదేహంతో ఆందోళన..
అశ్విని మృతికి సురేష్‌రెడ్డే కారణమంటూ మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి బోడలదిన్నె గ్రామంలోని సురేష్‌రెడ్డి ఇంట్లో మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న నేరేడుచర్ల ఎస్‌ఐ రవీందర్‌ తన సిబ్బందితో బోడలదిన్నె గ్రామానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు కుటుంబాలతో గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిపి సోమవారం అశ్విని మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. అశ్విని మృతికి సురేష్‌రెడ్డి కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)