Breaking News

నా భర్తతోనే వివాహేతర సంబంధం పెట్టుకుంటావా బుజ్జమ్మ..!

Published on Wed, 03/19/2025 - 12:04

నారాయణపేట రూరల్‌: తన భర్తతో మరో మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానంతో రాయితో మోది హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జలాల్‌పూర్‌ గ్రామానికి చెందిన బుజ్జమ్మ అలియాస్‌ వెంకటమ్మ(36)కు 15 ఏళ్ల క్రి తం కర్ణాటక రాష్ట్రం నస్లైకి చెందిన రాజుతో వివాహమైంది. పెళ్లయిన రెండేళ్లకే భర్త నుంచి విడిపోయి తల్లి వారింట్లో ఉంటోంది. జీవనోపాధి కోసం పల్లె ప్రకృతి వనంలో మొక్కలకు నీళ్లు పోసే పనిచేస్తుండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మొగులప్పతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. 

ఇరువురి ప్రవర్తనపై అను మానం వచ్చిన మొగులప్ప భార్య లక్ష్మి గతంలో పలుమార్లు బుజ్జమ్మతో గొడవ పడింది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి సర్దిచెప్పారు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇరువురి మధ్య ఎన్నోసార్లు గొడవలు, దాడులు జరిగాయి. ఈ క్రమంలో మంగళవారం నర్సరీలో పనిచేస్తున్న బుజ్జమ్మ దగ్గరకు లక్ష్మి ఆవేశంగా వెళ్లింది. ఇది గమనించిన బుజ్జమ్మ తనపై దాడి చేయడానికి వస్తుందని ఉపాధి హామీ మేటికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించి, నర్సరీ గేటుకు తాళం వేసుకుంది. 

అయినప్పటికీ లక్ష్మి ముళ్లపొదలను దాటు కుంటూ లోపలికి వెళ్లి రాయితో బలంగా బుజ్జమ్మ తలపై మోదడంతో రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న సీఐ శివకుమార్‌, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బుజ్జమ్మ సోదరుడు నందిపాటి రామచంద్రప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)