Breaking News

‘నేను నిన్ను ప్రేమిస్తున్నా.. భర్త, పిల్లలను వదిలేసి రా'

Published on Thu, 07/03/2025 - 08:39

జనగాం: ఒక పక్క భర్త.. మరోపక్క ప్రేమపేరుతో తరచూ ఫోన్‌ చేస్తున్న ఓ యువకుడి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం ముల్కనూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెందిన ఏదుల సతీశ్‌కుమార్‌తో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన శైలజ(24)కు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి కాపురం 5 సంవత్సరాలు సజావుగానే  సాగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

ఈ క్రమంలో 3 సంవత్సరాల నుంచి పిండిప్రోలు గ్రామానికి చెందిన యువకుడు కంపటి శ్రీరామ్‌.. తరచూ శైలజకు ఫోన్‌ చేసి ప్రేమపేరుతో వేధిస్తున్నాడు.‘నేను నిన్ను ప్రేమిస్తున్నా.. మనమిద్దరం కలిసి ఉందాం.. పిల్లలు, భర్తను వదిలిపెట్టి రా’అని వేధిస్తున్నాడు. ఈ విషయం భర్త సతీశ్‌కుమార్‌కు రెండు సంవత్సరాల క్రితం తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఎన్నాళ్ల నుంచి కొనసాగుతుందని ప్రశ్నిస్తూ.. నువ్వు ఎందుకు బతుకుతున్నావు, చావరాదు అని తరచూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. 

దీంతో భర్త సతీశ్‌కుమార్, యువకుడు శ్రీరామ్‌ వేధింపులు తాళలేక శైలజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగింది. గమనించిన భర్త  సతీశ్‌కుమార్‌ హుటాహుటిన మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా శైలజ మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి కవిత ఫిర్యాదు మేరకు భర్త సతీశ్‌కుమార్, యువకుడు శ్రీరామ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్‌కె. రియాజ్‌పాషా  తెలిపారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)