Breaking News

అత్తింటి వేధింపులకు నవ వధువు బలి

Published on Mon, 06/23/2025 - 07:06

హైదరాబాద్‌: అత్తింటి వేధింపులు భరించలేక ఓ నవ వధువు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్‌బీ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన మాలోతు పూజిత (19)కు, జాటోతు శ్రీనుతో ఈ ఏడాది ఏప్రిల్‌ 16న వివాహమైంది. జాటోతు శ్రీను ఓ జ్యువెలరీ షాపులో సేల్స్‌ మేనేజర్‌. కేపీహెచ్‌బీ కాలనీలోని రోడ్డు నెంబర్‌ 3, టెంపుల్‌ బస్టాప్‌ సమీపంలోని ఈఎస్‌డబ్ల్యూ 1140లో నివసిస్తున్నారు. పూజిత పెళ్లి సమయంలో 8 తులాల బంగారంతో పాటు సుమారు రూ.11 లక్షలు ఇచ్చారు. 

కొద్ది రోజుల తర్వాత అదనపు కట్నం కోసం అత్త, మామ, భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను వేధింపులకు గురి చేయసాగారు. అదనంగా రూ.10 లక్షల అదనపు కట్నం కావాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో పూజిత నానమ్మ మాలోతు భద్రమ్మ వచ్చే పంట విక్రయాల అనంతరం అదనపు కట్నం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ నెల 21న రాత్రి 12 గంటలకు పూజిత నానమ్మకు శ్రీను ఫోన్‌ చేసి ఉదయం 9 గంటలకు తాను పనికి వెళ్లి రాత్రి 11.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చానని, ఇంతలో పూజిత చీరతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందన్నాడు. 

పూజిత తన సోదరులతో కలిసి కూల్‌డ్రింక్‌ తాగుతున్న ఫొటోలను హరి అనే వ్యక్తి శ్రీనుకి పంపించాడని, వాటిని చూపించి శ్రీను ఆమెను వేధిస్తున్నాడని, తన మనవరాలు మృతికి శ్రీను, అతని కుటుంబ సభ్యులే కారణమని పూజిత నానమ్మ కేపీహెచ్‌బీ పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)