Breaking News

మహిళ ఆత్మహత్య

Published on Thu, 05/15/2025 - 07:33

నాగోలు(హైదరాబాద్): భర్త వేధింపుల కారణంగా ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్‌బీనగర్‌ పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.ఖమ్మం పట్టణానికి చెందిన కట్టా వెంకటేశ్వర్లు కుమార్తె జాస్మిన్‌(29)కు ఎల్‌బీనగర్, శివపురి కాలనీ చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పెండెం రాజశేఖర్‌తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 25 లక్షల నగదు, 20 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. 

వివాహం జరిగిన కొన్నాళ్లకే రాజశేఖర్, అతడి కుటుంబ సభ్యులు జాస్మిన్‌ను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్ద మనుషులు ఆమెకు నచ్చజెప్పి కాపురానికి పంపించారు. అయినా తన వైఖరి మార్చుకోని రాజశేఖర్‌ కొన్నాళ్లకే జాస్మిన్‌ను కొట్టి పుట్టింటికి పంపించాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఖమ్మం మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

  రాజశేఖర్‌ను పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.  మంగళవారం ఆఫీస్‌కు వెళ్లిన రాజశేఖర్‌ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చూడగా లోపలి నుంచి గడియపెట్టి ఉంది. జాస్మిన్‌ను పిలిచినా స్పందన లేకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులు  పగలకొట్టి చూడగా  జాస్మిన్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. కిందకు దింపి చూడగా అప్పటికే ఆమె మృతి చెంది ఉంది. 

దీంతో అతను ఎల్‌బీనగర్‌ పోలీసులు, జాస్మిన్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. జాస్మిన్‌ శరీరంపై గాయాలను గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు రాజశేఖర్‌ ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. మృతురాలి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)