Breaking News

వివాహితతో సహజీవనం.. ఉపాధ్యాయుడికి హెచ్‌ఐవీ..?

Published on Mon, 02/10/2025 - 07:50

సూర్యాపేటటౌన్‌: విద్యాబుద్ధులు నేర్పించే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెలపై అత్యాచారం ఒడిగట్టాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్‌లో నివాసముండే ప్రభుత్వ ఉపాధ్యాయుడు జాటోతు సునీల్‌కుమార్‌ జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా అతడు భార్యకు దూరంగా ఉంటూ మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. 2018 నుంచి ఆ మహిళతోనే ఉంటూ సహజీవనం చేస్తున్నాడు. సదరు మహిళకు భర్త లేడు. ఇద్దరు కుమార్తెలు ఉండడంతో వారిని చదివించుకుంటూ సునీల్‌కుమార్‌తోనే ఉంటోంది.  

తల్లితో సహజీవనం చేస్తూ..  ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం..
జాటోతు సునీల్‌కుమార్‌ కన్ను ఆ మహిళ కుమార్తెలపై పడింది. వారిని ఎలాగైనా లొంగతీసుకోవాలనే కోరికతో కొద్దిరోజులుగా ముగ్గురికి నిద్రమాత్రలు ఇస్తూ సదరు మహిళ ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం చేశాడు. తల్లితో చెబితే చంపేస్తానని బెదిరింపులకు సైతం పాల్పడ్డాడు. ఓ రోజు సదరు మహిళ చూస్తుండగానే ఆమె కుమార్తెపై సునీల్‌కుమార్‌ అత్యాచారం చేస్తుండగా వెంటనే కేకలు వేసి అతడి చెర నుంచి విడిపించింది. 

పోక్సో కేసు నమోదు...
సదరు మహిళ సూర్యాపేట పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఈ నెల 5వ తేదీన సునీల్‌కుమార్‌పై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సునీల్‌కుమార్‌పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ వీరరాఘవులు తెలిపారు. సునీల్‌కుమార్‌ తనను తనను పెళ్లి కూడా చేసుకున్నాడని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

ఉపాధ్యాయుడికి హెచ్‌ఐవీ..? 
సునీల్‌కుమార్‌కు హెచ్‌ఐవీతో పాటు పలు సుఖ వ్యాధులు ఉన్నట్లు సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. తమకు న్యాయం చేసి ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. సునీల్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసి హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయిస్తామని పట్టణ సీఐ తెలిపారు. అదేవిధంగా సదరు మహిళకు, ఆమె కుమార్తెలకు కూడా సోమవారం హెచ్‌ఐవీ పరీక్షలు చేయించనున్నట్లు చెప్పారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)