Breaking News

అతడిని వదిలిపెట్టొద్దు.. నా జీవితం నాశనం చేశాడు!

Published on Tue, 11/18/2025 - 10:47

హైదరాబాద్‌: ఆమె బీటెక్‌ చదువుతోంది.. ప్రేమించానని ఓ యువకుడు నమ్మబలకడంతో ప్రేమపెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్తతోపాటు అతని కుటుంబసభ్యులు కట్నం, బంగారం తీసుకురావాలని వేధించడంతో ఆత్మహత్య చేసుకుంది. ఎల్‌బీనగర్‌ పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం... మాన్సూరాబాద్‌ వాంబే కాలనీలో నివాసం ఉండే కుంచం సైదులు, దుర్గమ్మ భార్యభర్తలు. వీరికి ఓ కుమారుడు, కూతురు గంగోత్రి(21) ఉంది. గంగోత్రి నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ 3వ సంవత్సరం చదువుతోంది. 

అదే కళాశాలలో చదువుతున్న అబ్దుల్లాపూర్‌మెట్‌ చిన్న రావిరాల గ్రామానికి చెందిన నందినితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో నందిని అన్న భానును కొన్నిరోజుల క్రితం గంగోత్రికి ఆమె పరిచయం చేసింది. వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా భాను కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో రెండు నెలల క్రితం కీసరలో వారు వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల అనంతరం భాను గంగోత్రిని చిన్నరావిరాలలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే కట్నం, బంగారం తీసుకురాలేదని భాను కుటుంబసభ్యులు ఆమెను ఇబ్బందులకు గురి చేశారు. రూ. 30 లక్షల కట్నం, 10 తులాల బంగారం పెట్టాలని గంగోత్రి కుటుంబసభ్యులను డిమాండ్‌ చేశారు. 

కట్నం ఇచ్చే స్థోమత లేదని ఆమె తల్లిదండ్రులు చెప్పడంతో అప్పటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆమె కొన్ని రోజుల క్రితం మాన్సురాబాద్‌లోని తల్లిదండ్రుల వద్ద వచ్చింది. సోమవారం ఉదయం భాను బంధువులను తీసుకుని ఆమె వద్ద వచ్చాడు. కట్నం విషయంలో మరోసారి గొడవ పడ్డారు. మనస్తాపానికి గురైన గంగోత్రి సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తన చావుకు భాను కారణమని, అతడిని వదిలిపెట్టొద్దని, జీవితం నాశనం చేశాడని సూసైడ్‌ నోట్‌లో రాసింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)