ఇంటి ఓనర్ లైంగిక వేధింపులు వివాహిత ఆత్మహత్య

Published on Wed, 07/26/2023 - 13:52

వర్ధన్నపేట: లైంగిక వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వర్ధన్నపేట ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ కథనం ప్రకారం మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు గ్రామానికి చెందిన పస్తం శ్రీనుకు 2006 సంవత్సరంలో మంజుల (34)తో వివాహం జరిగింది. బతుకుదెరువు నిమిత్తం 10 సంవత్సరాల క్రితం ముంబై వెళ్లిన దంపతులు.. మూడు నెలల క్రితం ఇంటికి చేరుకున్నారు. ఈక్రమంలో మండలంలోని ఎలికెట్ట గ్రామం టిక్షతండాకు చెందిన జాటోత్‌ జితేందర్‌కు తమ ఇంట్లోని ఓ గదిని అద్దెకు ఇచ్చారు.

 ఈ నేపథ్యంలో జితేందర్‌ తరుచూ మంజులను లొంగదీసుకోవాలని యత్నించాడు. దీనిపై తొర్రూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు జితేందర్‌కు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అయినా ఆయనలో మార్పు రాకపోవడంతో మరోసారి పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఈ వేధింపులు తాళ లేక మంజుల 15 రోజుల క్రితం తన సోదరి శారద ఇంటికి వెళ్లింది. అక్కడ మంజులకు మాయమాటలు చెప్పిన జితేందర్‌.. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని తన గదికి తీసుకెళ్లాడు.

 అక్కడ లైంగిక దాడికి యత్నించడంతో మంజుల ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా వరంగల్‌ ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. ఈ ఘటనలో లైంగిక వేధింపులు తట్టుకోలేక తన భార్య మంజుల ఆత్మహత్యకు పాల్పడిందని భర్త శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.


 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)