Breaking News

‘హైడ్రా’ కూల్చివేతలు ఆపాలి.. హైకోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పిటిషన్‌

Published on Wed, 08/28/2024 - 15:31

సాక్షి, హైదరాబాద్‌: ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పేరుతో హైడ్రా కూల్చివేతలు ఆపాలంటూ హైకోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి రిట్‌ పిటిషన్‌ వేశారు. చినదామోర చెరువులోని బఫర్‌ జోన్‌, ఎఫ్‌టిఎల్‌ పరిధిలోని ఆక్రమణలను 7 రోజుల్లో తొలగించాలని నోటీసులు ఇచ్చారని..  హైడ్రా ఎటువంటి చట్టబద్దత లేని ఏజెన్సీ అని.. కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా సృష్టించబడిన సంస్థ మాత్రమేనని మర్రి రాజశేఖర్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఉదయం 6 గంటల సమయంలో నిర్మాణాలను కూల్చివేయడం ఏమిటంటూ పిటిషనర్‌ ప్రశ్నించారు. "హైడ్రా" చర్యలు సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టానికి విరుద్ధం అంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. విచారణ కొనసాగుతోంది.

తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై  ఫోకస్‌ పెట్టిన హైడ్రా.. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్​ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. దీంతో, కాలేజీలను కూల్చివేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ‘హైడ్రా’ ఫోకస్ పెట్టడంతో పలువురు అక్రమార్కుల గుండెల్లో టెన్షన్‌ మొదలైంది. ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించిన విషయం తెలిసిందే.

ఇక, తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్​ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీటితోపాటు దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ కాలేజీ సహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు అందాయి. చిన్న దామెరచెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించినందుకు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు.

	ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి MLRIT కాలేజీకి రెవిన్యూశాఖ నోటీసులు

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)