Breaking News

మార్గదర్శి కేసు: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై హైకోర్టు ఆగ్రహం

Published on Fri, 01/03/2025 - 17:22

హైదరాబాద్‌: మార్గదర్శి కేసు(Margadarsi Case) విచారణలో భాగంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకూ ఎందుకు కౌంటర్‌ దాఖలు చేయలేదని నిలదీసింది. ఇంత నిర్లక్ష్యం దేనికంటూ హైకోర్టు ప్రశ్నించింది. అదే సమయంలో మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌బీఐ కూడా మూడు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. 

తదుపరి విచారణను ఈనెల 31వ తేదీకి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు(Telangana High Court).. మార్గదర్శి అఫిడవిట్‌ కాపీని సోమవారంలోగా  ఉండవల్లికి ఇవ్వాలని ఫైనాన్షియర్‌ న్యాయవాదిని ఆదేశించింది.  ఇక ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు సమాచారం అందించేలా ఈ ఆర్డర్‌ కాపీని ఏజీలకు పంపాలని రిజస్ట్రీకి స్పష్టం చేసింది.

కాగా, చందాదా­రుల వివరాలను అందించే విషయంలో నిజాయితీగా ఉండాలని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.  ఇలాంటి విషయాల్లో పారదర్శకంగా ఉంటే అందరికీ మంచిదని మార్గదర్శికి స్పష్టం చేసింది.

కాలం వెళ్లదీస్తూ.. కాలయాపన చేస్తూ..
మార్గదర్శి కేసుకు సంబంధించి పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ, స్టేల మీద స్టేలు పొందుతూ మార్గదర్శి, రామోజీరావు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దాని ఫలితంగానే గత 18 ఏళ్లుగా కేసు కొనసాగుతూ వస్తోంది. ప్రజల నుంచి ఏకంగా రూ.2,610 కోట్ల మేర డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు బండారం 2006 నవంబర్‌ 6న బట్టబయలైంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చట్టం సెక్షన్‌ 45 ఎస్‌కు విరుద్ధంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ప్రజల ముందు నిలబెట్టిన రోజు అది. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయిన మార్గదర్శి, రామోజీరావు చట్టం నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు.

అయితేసుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో తిరిగి విచారణ చేపట్టింది తెలంగాణ హైకోర్టు.  దీనిలో భాగంగా ఈరోజు(శుక్రవారం) మరోసారి మార్గదర్శి కేసు విచారణకు రాగా, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికీ కౌంటర్‌ దాఖలు చేయకపోడాన్ని ప్రశ్నించింది హైకోర్టు,.

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై హైకోర్టు ఆగ్రహం

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)