Breaking News

వైటీడీఏ భూములన్నీ టెంపుల్‌ సిటీలోనే..

Published on Wed, 09/03/2025 - 03:40

సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆస్తులన్నీ టెంపుల్‌ సిటీలోనే ఉండాలని ప్రభుత్వం నిర్ణ యించింది. టెంపుల్‌సిటీ పరిధి నిర్ణయం కోసం.. ఇటీవల యాదగిరిగుట్ట దేవస్థానం అతిథిగృహంలో ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరిగింది. అసెంబ్లీలో చట్టం చేసిన యాదగిరిగుట్ట టెంపుల్‌ సిటీ జియోగ్రాఫికల్‌ ఏరియా హద్దుల నిర్ణయంపై చర్చించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్, భువనగిరి జిల్లా కలెక్టర్‌ ఎం.హనుమంతరావు, దేవస్థానం ఈవో వెంకట్‌రావు, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావుతోపాటు వివిధ శాఖల అధికారులతో టెంపుల్‌ సిటీ పరిధిపై చర్చించారు. 

కేవలం యాదగిరిగుట్ట చుట్టూ ఉన్న భూముల్నే టెంపుల్‌ సిటీ ఆస్తులుగా గుర్తించిన తీరును ప్రిన్సిపల్‌ సెక్రటరీ తిరస్కరించారు. దేవస్థానానికి ఉన్న భూముల వివరాలతో నివేదికను సిద్ధం చేయాలని మరికొంత సమయం ఇచ్చారు. ప్రభుత్వం యాదగిరిగుట్ట టెంపుల్‌ సిటీ ఏర్పాటుకు గత అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేసింది. దీని ప్రకారం యాదగిరిగుట్ట టెంపుల్‌ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల మాదిరిగా ఆలయ పవిత్రత, సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేవిధంగా టెంపుల్‌ సిటీ పరిధిని నిర్ణయిస్తున్నారు. 

ఇందుకోసం యాదగిరిగుట్టలో గతంలో వైటీడీఏ (యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) సేకరించిన భూములను సర్వే నంబర్ల వారీగా డీజీపీ ఎస్‌ సర్వే చేయించారు. అయితే కేవలం యాదగిరిగుట్ట చుట్టూ ఉన్న భూములు సర్వే నంబర్ల వారీగా టెంపుల్‌ సిటీ పరిధిని నిర్ణయించి మ్యాప్‌లను సిద్ధం చేశారు. అయితే దేవస్థానం పరిధిలో ఇతర గ్రామాల్లో కూడా ఉన్న వైటీడీఏ భూముల ను ఇందులో చేర్చలేదు. అయితే భవిష్యత్‌ లో భూముల విషయంలో వివాదం తలెత్తకుండా వైటీడీఏ గ్రామాల్లో సేకరించిన అన్ని భూములు, వాటిని ఏయే శాఖల కు కేటాయించారో సమగ్ర వివ రాలను పొందపరచనున్నారు. 

దీంతోపాటు శ్రీస్వా మివారికి హైదరాబాద్‌ బంజారాహిల్స్, భువనగిరిగంజ్‌లో, జనగామ జిల్లా బచ్చ న్నపేట మండలం దబగుంటపల్లి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న వందల ఎక రాల భూములు, భవనాలు గుర్తించి వాటికి డీజీపీఎస్‌ సర్వే చేస్తున్నారు.  దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయాల భూము లను డీజీపీఎస్‌ సర్వే చేయించి హద్దులు నిర్ణయిస్తున్నారు. ప్రధానంగా దేవుని భూ ములు పలుచోట్ల అన్యాక్రాంతం అయ్యా యి. దేవుని పేరున్న గ్రామాల్లో.. అదే పేరున్న వ్యక్తుల పేరున పట్టాలు అయ్యా యి. పట్టాదారు పాస్‌పుస్తకాలు వచ్చాయి. మరికొన్నిచోట్ల క్రయవిక్రయాలు జరిగాయి. ఇలా అన్యాక్రాంతమైన వేలాది ఎకరాల భూముల లెక్కలు తీసే పనిలో దేవాదాయ, రెవెన్యూ అధికారులున్నారు.  

Videos

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)