Breaking News

దాదాలు వచ్చాకే జీవితాలు మారాయి

Published on Sun, 12/07/2025 - 03:35

దండకారణ్యం నుంచి సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: హిడ్మా స్వగ్రామమైన పువ్వర్తికి 3 కిలోమీటర్ల దూరాన ఉన్న భట్టిగూడేనికి చెందిన కోవాసి భీమా అలియాస్‌ బాబు మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్లుగా కొనసాగిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి, నంబాల కేశవరావు అలియాస్‌ బస్వరాజుకు సెక్యూరిటీ గార్డుగా 12 ఏళ్లపాటు పనిచేశాడు. అనారోగ్య కారణాల రీత్యా ఇటీవల లొంగిపోయాడు. ఈ సందర్భంగా భీమాను ‘సాక్షి ప్రతినిధి’కలవగా మావోయిస్టుగా గెరిల్లా జీవితం, అటు ప్రభుత్వ పాలసీలను దగ్గర నుంచి చూశానని వెల్లడించాడు. ప్రస్తుత పరిస్థితులపై ఆయన వెల్లడించిన వివరాలు భీమా మాటల్లోనే...

‘సుప్రీం లీడర్‌’రక్షణ బాధ్యతల్లో
పీఎల్‌జీఏ కంపెనీ–7లోకి నన్ను 2012లో తీసుకున్నారు. పార్టీ జనరల్‌ సెక్రటరీకి రక్షణ కల్పించే బాధ్యత ఈ కంపెనీదే. అక్కడ ప్రెస్, మెడికల్‌ టీమ్‌ల్లో పనిచేశా. రెండుసార్లు ప్రత్యక్షంగా గణపతి దాదాను కలిసే అవకాశం కలిగింది. బీఆర్‌ దాదా(నంబాల)తో చాలాసార్లు మాట్లాడాను. 

అనారోగ్య సమస్యలు రావడంతో ఈ ఏడాది జనవరిలో నన్ను కంపెనీ–7 నుంచి తప్పించి వేరే బాధ్యతలు అప్పగించారు. కానీ ఆరోగ్యం మరింతగా విషమించడంతో మే మొదటివారంలో ఆయుధాలు పార్టీకి అప్పగించి లొంగిపోయాను. జూన్‌లో నా లొంగుబాటును అధికారికంగా చూపించారు.

బీఆర్‌ దాదా చనిపోయినప్పుడు.. 
బీఆర్‌ దాదా ఎన్‌కౌంటర్‌ జరిగినప్పుడు నేను పోలీసుల వద్దే ఉన్నాను. ఆ రోజంతా ఆ క్యాంపులో ఒకటే హడావుడి. ‘మీ కంపెనీ–7 మాకు చిక్కింది’అంటూ అక్కడి అధికారులు చెప్పారు. బీఆర్‌ దాదాకు బీపీ తప్పితే ఇతర అనారోగ్య సమస్యలు లేవు. కాకపోతే స్థూలకాయం వల్ల ఇబ్బంది పడేవాడు.

కగార్‌ వల్ల ఎప్పటికప్పుడు క్యాంపులు మారుస్తూ, కొండలు, గుట్టలు ఎక్కడం, దిగడంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకునేందుకు మూడు రోజుల పాటు కనీస విశ్రాంతి, తిండి, నీరు లేకుండా బీఆర్‌ దాదా శ్రమించాడు. కానీ ఘోరం జరిగిపోయింది.

తెలుగు వర్సెస్‌ ఆదివాసీలు
ఆపరేషన్‌ కగార్‌ వల్ల ఒక్కరోజు కూడా దళాలు సేఫ్‌గా క్యాంప్‌ వేసే పరిస్థితి లేదు. పదిమందితో దళం ఉంటే వేయి మంది జవాన్లు చుట్టుముడుతున్నారు. ఈ క్రమంలో పార్టీకి నష్టం జరిగినప్పుడు కచ్చితంగా చర్చ జరుగుతుంది. నిర్ణయాలను సమీక్షిస్తారు. పార్టీ భవిష్యత్‌ కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై గందరోళ పరిస్థితులు ఎదురవుతున్నాయి. అంతే తప్ప తెలుగు నేతలు, ఛత్తీస్‌గఢ్‌ ఆదివాసీలు అనే భేదం పార్టీలో లేదు. 

ఒకప్పుడు ఇక్కడ పార్టీ బలంగా ఉండేది. హిడ్మా నాయకత్వంలో ఒక బెటాలియన్, 12 కంపెనీలతో కూడిన పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ ఉండేది. వీటికి సాయుధ దళాలు అదనం. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు. కగార్‌తో పార్టీ చాలా బలహీనపడింది.

దాదాలు (నక్సలైట్లు) వచ్చాకే మా జీవితాలు మారాయి. భూమిని పంచారు. వ్యవసాయం నేర్పారు, మంచినీళ్ల కోసం బావులు, చెరువులు తవ్వించారు. మూడు నుంచి నాలుగు నెలల పాటు ‘గెరిల్లా’లకు డాక్టర్ల చేత శిక్షణ ఇప్పించారు. ఈ శిక్షణ ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేసింది. ఐదు వందలకు పైగా బడులు తెరిచారు. ఇప్పుడు మా ప్రాంతంలో అభివృద్ధి పేరుతో నాలుగు వరుసల రహదారులు నిర్మిస్తున్నారు. ఇక్కడి ప్రజలకు కనీసం సైకిల్‌ కూడా ఉండదు. అలాంటప్పుడు ఇంత పెద్ద రోడ్లు ఎందుకు నిర్మిస్తున్నారు. వాటి వల్ల ఎవరికి ప్రయోజనం అనేది బుద్ధి జీవులే ఆలోచించాలి.  – కోవాసి భీమా

#

Tags : 1

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)