Breaking News

పువర్తిలో హిడ్మా స్మారక స్తూపం?

Published on Mon, 11/24/2025 - 07:25

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా సొంతూరైన పువర్తిలో స్మారక స్తూపం నిర్మించేందుకు బస్తర్‌ ఆదివాసీలు సిద్ధమవుతున్నారు. అయితే ఈ స్మారక స్తూపం నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేలా చేయాలంటూ మీడియా ప్రతిని«ధులు, ప్రజాసంఘాలను వారు కోరుతున్నారు. హిడ్మా అంత్యక్రియలు ముగిసిన తర్వాత స్థానిక ఆదివాసీలు తమ వివరాలు గోప్యంగా ఉంచాలనే షరతుపై ఓ యూట్యూబ్‌ చానల్‌కు తమ సమస్యలు చెప్పుకున్నారు. 

వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ‘మా ఆదివాసీల కోసం హిడ్మా ఎంతో చేశాడు. అతడిని ఎదుర్కొనేందుకే ప్రభుత్వాలు మా ప్రాంతంలో యుద్ధప్రాతిపదికన రోడ్లు, వంతెనలు, కరెంటు, ఇంటర్‌నెట్‌ వంటి సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పుడు అతడు చనిపోయాడు కదా అని ఆ అభివృద్ధి పనులను మధ్యలో ఆపొద్దు. వాటిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మా నాయకుడికి గుర్తుగా స్మారక స్తూపం నిర్మించుకునేందుకు అనుమతి మంజూరు చేయాలి. ఈ మేరకు అవసరమైన సహకారాన్ని సమాజం నుంచి ఆశిస్తున్నాం’అని వారు వెల్లడించారు.  

దేవాను చంపకండి: ‘హిడ్మా అంత్యక్రియల సందర్భంగా అతని మృతదేహాన్ని పరిశీలిస్తే తూటా గాయాల కంటే కత్తితో చేసిన గాయాలే ఎక్కువగా శరీరంపై ఉన్నాయి. ఎన్‌కౌంటర్‌లో చనిపోతే ఇలా జరగదు కదా. గతంలో నిరాయుధులుగా జవాన్లు దొరికితే, హిడ్మా బందీలుగా తీసుకున్నాడే తప్ప ఎప్పుడూ వారికి ప్రాణ హాని తలపెట్టలేదు. ప్రజాకోర్టులో చర్చలు జరిపి గౌరవంగానే వారిని విడిచిపెట్టా డు. మా గ్రామం నుంచి బార్సే దేవా ఇంకా పారీ్టలోనే ఉన్నాడు. లొంగిపోవడానికి వస్తే దయచేసి చంపొద్దు. అతడిని అరెస్ట్‌ చేయండి, కేసులు పెట్టండి, జీవితాంతం జైల్లో ఉంచండి’అని పువర్తిలో ఉన్న ఆదివాసీలు ప్రభుత్వాలను కోరుతున్నారు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)