బడే దామోదర్‌కు ఏమైంది?

Published on Mon, 01/20/2025 - 07:43

ములుగు/ఎస్‌ఎస్‌ తాడ్వాయి: మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌కు ఏమైందంటూ సర్వత్రా చర్చ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని పూజారి కాంకేర్‌– మారేడుపాక అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దా మోదర్‌ మృతి చెందాడని శనివారం మావోయిస్టుపార్టీ సౌత్‌ బస్తర్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి గంగా పేరిట విడుదలైన లేఖ ఫేక్‌ అంటూ దామోదర్‌ అనుచరులు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. 

ఎన్‌కౌంటర్‌ జరిగిన సమయంలో దామోదర్‌ అక్క డే ఉన్నారని, ఆ సమయంలో గాయాలపాలైన ఆయన్ను అనుచరులు భద్రంగా మరోచోటకు తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దామోదర్‌ ఆరో గ్యం నిలకడగా ఉందని, ఆయన ప్రాణానికి ఎలాంటి హాని లేదని సమాచారం. సాధారణంగా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు కుటుంబాలకు పోలీస్‌శాఖ తరఫున మరణవార్త తెలపడంతోపాటు మృతదేహాన్ని అప్పగిస్తారు.

 దామోదర్‌ మృతి చెందినట్టు ప్రచారం జరుగుతున్నా, అధికారికంగా పోలీస్‌శాఖ తరఫున కాల్వపల్లిలోని దామోదర్‌ తల్లి బతుకమ్మ, కుటుంబ సభ్యులకు, ములుగు జిల్లా పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో దామోదర్‌కు ఎలాంటి హాని జరగలేదని, కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాల్వపల్లివాసులు వాపోతున్నారు.

 

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)