Breaking News

కాజీపేట స్టేషన్‌లో ట్రాక్‌పైకి వరద నీరు.. పలు రైళ్లు రద్దు!

Published on Thu, 07/27/2023 - 13:57

సాక్షి, హన్మకొండ: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయిలో వానలు కురుస్తుండటంతో పలు గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరదలతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరి.. చెరువులను తలపిస్తోంది. 

ఇదిలా ఉండగా.. భారీ వానల నేపథ్యంలో కాజీపేట్‌ రైల్వే స్టేషన్‌(జంక్షన్‌)లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రైల్లే పట్టాలపై నీరు చేరడంతో రైలు ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో, హసన్‌పర్తి-ఖాజీపేట రూట్‌లో మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 9 రైళ్లను దారి మళ్లించారు.

సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్ (17012), సికింద్రాబాద్-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (17233),  సిర్పూర్‌ కాగజ్ నగర్-సికింద్రాబాద్ (17234) రైళ్లను రద్దు చేశారు. తిరుపతి - కరీంనగర్ (12761), కరీంనగర్-తిరుపతి (12762), సికింద్రాబాద్ -సిర్పూర్‌ కాగజ్ నగర్ (12757),  సిర్పూర్‌ కాగజ్ నగర్ -సికింద్రాబాద్ (12758) రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

ఇది కూడా చదవండి: తెలంగాణ చరిత్రలోనే భారీ వర్షం.. రంగంలోకి కేసీఆర్‌

Videos

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)