Breaking News

పీఆర్‌ ఆర్డీలో పునరావాసం

Published on Fri, 04/11/2025 - 04:39

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి (పీఆర్‌ ఆర్డీ) శాఖలో పాతకాపులకు పునరావాసం కల్పించారనే విమర్శలొస్తున్నాయి. గతంలోనే రిటైర్‌ అయ్యి మళ్లీ అపాయింట్‌ అయిన పలువురు అధికారులను ఇటీవలే తొలగించిన విషయం తెలిసిందే. ఇలా తొలగించిన వారిలో కొందరిని మళ్లీ కొనసాగిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 

ఈ శాఖలోని పలు కీలక పోస్టుల్లో కొన్నేళ్లుగా రిటైరైన ఉన్నతాధికారులే కొనసాగుతుండగా... వారి సర్వీసులను రద్దుచేయాలనే సీఎస్‌ ఆదేశాలతో మిషన్‌ భగీరథ ఈఎన్‌సీగా కృపాకర్‌రెడ్డి, స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ కార్యదర్శిగా అశోక్‌ కుమార్, స్త్రీ నిధి సంస్థ ఎండీ విద్యాసాగర్‌ రెడ్డిలను రీ అపాయింట్‌మెంట్‌ సర్వీసు నుంచి తొలగించారు. వీరితోపాటు మార్చి 31 తో పంచాయతీ రాజ్‌ శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) కనకరత్నం కూడా పదవీ విరమణ చేశారు. 

ఈ విభాగాలకు సంబంధించి కీలక బాధ్యతల్లో ఉన్న వీరిని ఉపసంహరించినా, ఆయా విభాగాల్లో తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందనే విమర్శలు వచ్చాయి. కనీసం ఆయా పోస్టులకు ఇన్‌చార్జీలను అయినా నియమించి ఉంటే సమస్య ఇంత తీవ్రంగా మారి ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే సీఎస్‌ ఇచ్చిన ఆదేశాల్లోనే... అవసరాన్ని బట్టి ఆయా అధికారులను ‘రీ అపాయింట్‌’ చేసుకోవచ్చునని పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో పీఆర్‌ ఈఎన్‌సీగా కనకరత్నం సర్వీస్‌ను ఏడాది పొడిగించారు. మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి రీఅపాయింట్‌మెంట్‌ అయినపుడే 2025 అక్టోబర్‌ వరకు గడువు ఉండటంతో ఆయన సర్వీసును కూడా అప్పటిదాకా, స్త్రీ నిధి సంస్థ ఎండీ విద్యాసాగర్‌రెడ్డి సర్వీస్‌ను మరో ఏడాది పొడిగించారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)