Breaking News

అపురూపాల మంత్రపురి

Published on Mon, 02/24/2025 - 20:16

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని (Manthani) ప్రాచీన పట్టణం. సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఆ గ్రామంలో ప్రజల ఆహారపు అలవాట్లు, వినియోగించే వస్తువులు.. ఇలా అన్నీ భిన్నంగానే ఉంటాయి. ఉన్నతోద్యోగాలు, ఉపాధి కోసం.. మంత్రపురి (Mantrapuri) వాసులు ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడిపోయారు. సమాజంలో మార్పులకు ఇక్కడి ప్రజలు కూడా అలవాటు పడిపోతున్నారు. కానీ మంథనిలోని సీతారామ సేవా సదన్‌ స్వచ్ఛంద సేవా సంస్థ.. ఈ గ్రామస్తులు తరతరాలుగా వినియోగించిన విలువైన పురాతన వస్తు సామగ్రిని భవిష్యత్‌తరాలకు అందించేందుకు కృషి చేస్తోంది. 

అందుకోసం మంత్రపురిలోని పురాతన ఇళ్లు, వాటిలోని వస్తుసామగ్రి, వంటలు, వ్యవసాయ.. తదితర అవసరాలకు ఉపయోగించే పురాతన వస్తువులను సేకరించి ప్రదర్శించేందుకు మంత్రపురి దర్శన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో పురాతన వంటసామగ్రి, ధాన్యం నిల్వచేసే గాదెలు, కొలతలు, ప్రమాణాల పరికరాలు, వ్యవసాయ పరికరాలు, ఎండ, వేడి, చలిని తట్టుకునేలా సొనార్చి (మిద్దె), పాలతం.. తదితర సుమారు ఐదు వందల రకాల వస్తువులను ప్రదర్శనగా ఉంచారు. ఇందు కోసం ఓ ఇంటిని ప్రత్యేకంగా నిర్మించారు. 

ప్రజల సందర్శనార్థం రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ప్రదర్శన శాలను తెరిచి ఉంచుతున్నారు. వివిధ దేశాల్లో స్థిరపడి స్వస్థలానికి వచ్చిన ప్రవాసులు.. ఈ పురాతన వస్తువులను దర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. మంథనితోపాటు చుట్టు పక్కల ప్రాంతాల విద్యార్థులకు ఇందులో అవకాశం కల్పిస్తున్నారు. పురాతన వస్తుసామగ్రి సేకరణకు దాదాపు మూడేళ్లకు పైగా సమయం పట్టిందని, మరో 50 ఏళ్లు ఇవి ఉండేలా ఇంటిని నిర్మించామని సేవా సదన్‌ (Seva Sadan) వ్యవస్థాపకుడు గట్టు నారాయణ గురూజీ, అధ్యక్షుడు కర్నే హరిబాబు తెలిపారు.

ఎన్టీపీసీ, సింగరేణిలో ప్రదర్శన 
మంత్రపురి దర్శన్‌లోని తాళపత్ర గ్రంథాలతోపాటు ఇతర పురాతన వస్తువులను ఎన్టీపీసీ, సింగరేణి సంస్థ ఉన్నతాధికారులు తీసుకెళ్లి తమ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు. ఇలా పలుమార్లు పలు సంస్థలు.. ఇతర ప్రాంతాల వారు వచ్చి ఈ పురాతన వస్తువులను తీసుకెళ్లి తమ కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ తీసుకొచ్చి మంత్రపురి దర్శన్‌ నిర్వాహకులకు అప్పగిస్తున్నారు.

చ‌ద‌వండి: మల్లన్నగుట్టే.. చిన్న శ్రీశైలం

నేటితరం కోసం.. 
భారతీయ ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రకృతిలో లభించే అనేక వస్తువులు కనుమరుగవుతున్నాయి. ఈక్రమంలో నాటి కుటీర, గ్రామీణ వ్యవస్థ, వస్తువులను నేటితరానికి చూపించాలనే ఆకాంక్షతోనే గట్టు నారాయణ గురూజీ ఈ అవకాశం కల్పించారు. విద్యార్థులు, యువత అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)