Breaking News

Video: కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడిన ప్రయాణికుడు

Published on Tue, 01/30/2024 - 13:46

సాక్షి, వికారాబాద్‌: కదులుతున్న రైలు ఎక్కబోయి ఓ ప్రయాణికుడు రైల్వే ట్రాక్‌ మధ్యలో ఇరుక్కుపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది.. ట్రాక్‌ మధ్యలో చిక్కుకున్న వ్యక్తిని సురక్షితంగా బయటకు లాగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌లో  వెలుగుచూసింది. 

బీదర్‌ నుంచి యశ్వంతపూర్‌ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయలు దేరింది. స్టేషన్‌ నుంచి ఓ ప్రయాణికుడు హుటాహుటినా పరుగెత్తుకొచ్చి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాలుజారి ప్రమాదవశాత్తు రైలుకు, ట్రాక్‌కు మధ్య ఇరుక్కుపోయాడు. విషయం గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్‌ లాగి రైలును ఆపారు.

రైల్వే సిబ్బంది, పోలీసులు రెండు గంటలు శ్రమించి రైల్వే ట్రాక్ మధ్యలో ఇరుక్కున్న వ్యక్తిని కాపాడారు. ప్లాట్‌ఫాం పగులగొట్టి ప్రయాణికుడిని అతడిని బయటకు తీశారు. అతడికి స్వల్ప గాయాలవ్వగా.. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. గాయపడిన వ్యక్తిని రాయచూర్‌కు చెందిన సతీష్‌గా గుర్తించారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి. ప్రయాణికుడిని కాపాడిన రైల్వే సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
చదవండి: ఏబీవీపీ కార్యకర్తను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన ఘటన.. కానిస్టేబుల్‌ సస్పెండ్‌

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)