Breaking News

ఇద్దరు వధువులు.. ఒక వరుడు

Published on Fri, 04/25/2025 - 10:56

ఆదిలాబాద్ జిల్లా: వివాహం చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్క చాలా మంది యువకులు ‘పెళ్లి కాని ప్రసాద్‌లు’గా మిగిలిపోతున్నారు. కొందరు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. ఒక వైపు పరిస్థితులు ఇలా ఉంటే.. మరో వైపు కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఓ గిరిజన యువకుడు ఇద్దరు యువతులతో ప్రేమాయణం నడిపి, ఇద్దరినీ ఒకే మండపంలో వివాహం చేసుకున్నాడు. 

జైనూర్‌ మండలం అడ్డెసరాకు చెందిన ఆత్రం రంభబాయి, భాద్రుషావ్‌ దంపతుల కుమారుడు ఆత్రం చత్రుషావ్‌.. అదే గ్రామానికి చెందిన సెడ్మకి సోమిత్రబాయి, భీంరావ్‌ల కుమార్తె జంగుబాయి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్‌ జిల్లా గాదిగూడ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన గోడం రంభబాయి, యాదోరావ్‌ కుమార్తె సోన్‌దేవితో చత్రుషావ్‌కు పరిచయం ఏర్పడింది.

 వీరిద్దరి మధ్య ఏడాదిగా ప్రేమాయణం సాగుతోంది. విషయం తెలుసుకున్న జంగుబాయి రాయిసెంటర్‌ను ఆశ్రయించింది. రాయిసెంటర్‌ పెద్దలు 15 రోజుల క్రితం మూడు కుటుంబాలతో చర్చించారు. యువతులిద్దరూ చత్రుషావ్‌తో కలిసి ఉండేందుకు ఒప్పుకున్నారు. దీంతో గురువారం బంధువుల సమక్షంలో వరుడి స్వగృహంలో వీరికి వివాహం జరిపించారు. కాగా, ఇటీవల ఇదే జిల్లాలో సిర్పూర్‌(యూ) మండలం గుంనూర్‌ (కె)కు చెందిన ఓ యువకుడు కూడా ఇద్దరు యువతులను పెళ్లి చేసుకోవడం తెలిసిందే.    

#

Tags : 1

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)