Breaking News

వాటర్‌ ట్యాంకుపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

Published on Thu, 08/22/2024 - 10:02

జీడిమెట్ల: మద్యం మత్తులో ఓ వ్యక్తి వాటర్‌ ట్యాంక్‌ పైనుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. ఇన్‌స్పెక్టర్‌ మల్లేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పార్వతీపురంనకు చెందిన బావిరి రాము (53)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి కుత్బుల్లాపూర్‌లో ఉంటూ మేస్త్రీ పనులు చేస్తున్నాడు. ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు.

 15 రోజుల క్రితం కూడా రాము మద్యం మత్తులో భార్యతో గొడవపడి  ఇంటి నుంచి  వెళ్లిపోయి గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. సోమవారం ఉదయం మద్యం మత్తులో స్థానిక ఎల్లమ్మ పోచమ్మ గుడి వద్ద ఉన్న వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి  కిందికి దూకి మృతి చెందాడు. మృతుడి కుమారుడు జైకుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. రాము వాటర్‌ ట్యాంక్‌పై నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడిన దృశ్యాలు బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.     

పోలీసులకు సమాచారం అందినా స్పందించలేదా? 
రాము ట్యాంక్‌పైకి ఎక్కడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించినా వారు పట్టించుకోలేదనే వదంతులు ఉన్నాయి. ఈ విషయమై ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. రాము ట్యాంక్‌పైకి ఎక్కి నిమిషాల్లోనే దూకి మృతి చెందాడని, ఈ విషయమై తమకు, డయల్‌ 100కు ఎలాంటి ఫోన్‌ కాల్‌ రాలేదని తెలిపారు.   
 

   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)