Breaking News

మామిడి తోటలో మృత్యువు కాటేసింది

Published on Fri, 04/18/2025 - 07:58

శంషాబాద్‌: బైక్‌పై వెళ్తున్న దంపతులకు రహదారి పక్కనే ఉన్న ఓ తోటలో కనిపించిన మామిడి కాయలు ఆకర్షించాయి. వాటిని తెంపి తీసుకొస్తున్న క్రమంలో భర్త విద్యుదాఘాతంతో అక్కడికక్కడే అసువులు బాసిన విషాదకర ఘటన శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలో నివాసముంటున్న తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలానికి చెందిన కె.చేతన్‌రెడ్డి (26) నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగి. ఆయన భార్య బిందు. మొయినాబాద్‌లోని భాస్కర లా కళాశాలలో గురువారం ఆమెతో పరీక్షలు రాయించి తిరిగి ఇబ్రహీంపటా్ననికి బైక్‌పై బయలుదేరారు. పెద్దషాపూర్‌ రైల్వేట్రాక్‌కు సమీపంలో రహదారి పక్కనే ఉన్న ఓ తోటలో విరగగాసిన మామిడి కాయలను చూసిన చేతన్‌రెడ్డి వాహనాన్ని నిలిపివేశాడు. 

తోటలోని మామిడికాయలు కోసుకు వస్తుండగా.. చెట్టు పక్కనే ఉన్న విద్యుత్‌ ట్రాన్‌ఫార్మర్‌ తీగలు తగలడంతో చేతన్‌రెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. భర్త అచేతనగా పడి ఉండటాన్ని చూసిన బిందు అరవడంతో స్థానికులు వచ్చి అతడిని పక్కకు జరిపారు. సీపీఆర్‌ చేసినా ఫలితం లేకుండాపోయింది. అప్పటికే అతడు మృతి చెందినట్లు  నిర్ధారించారు. అక్కడికి వచి్చన శంషాబాద్‌ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)