Breaking News

పెళ్లి పేరుతో నమ్మించి గర్భవతిని చేశాడు

Published on Mon, 03/24/2025 - 07:41

ఖమ్మం: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మైనర్‌ బాలికను గర్భవతిని చేశాడని, నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయాలని ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామానికి చెందిన పలువురు డిమాండ్‌ చేశారు. బాలిక బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలోని దళిత కాలనీకి చెందిన బాలిక, అదే గ్రామానికి చెందిన ముల్లంగి జమలయ్య అనే యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి కాగా, ఖమ్మం, విజయవాడలోని ఆస్పత్రులకు తీసుకెళ్లి అబార్షన్‌కు ప్రయత్నించాడని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని వారు ఆరోపించారు. 

దీంతో ఈనెల 21న తాము ఎర్రుపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోలేదని, 22వ తేదీన ఖమ్మంలో సీపీని కలిసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఆదివారం గ్రామస్తులతో కలిసి మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేశారు. ఆ తర్వాత మధిర – విజయవాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అయినా పోలీసులు స్పందించకపోవడంతో బాలిక స్టేషన్‌ పక్కనే ఉన్న వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమె సోదరుడు ట్యాంక్‌ ఎక్కి నచ్చజెప్పినా బాలిక కిందకు దిగకపోవడంతో ఎస్‌ఐ పి.వెంకటేష్‌, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 

దీంతో గ్రామస్తులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు బాలికకు న్యాయం చేస్తామని, నిందితుడిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చిన ఎస్‌ఐ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల సాయంతో బాలికను కిందకు తీసుకొచ్చారు. కాగా, స్టడీ సర్టిఫికెట్‌లో ఉన్న వయసు ప్రకారం ఆమె మైనర్‌ కాదని ఎస్‌ఐ చెబుతుండగా, ఆధార్‌ కార్డు, ఆస్పత్రి రికార్డులు తమ వద్ద ఉన్నాయని, వాటి ప్రకారం అమ్మాయి మైనరేనని బంధువులు అంటున్నారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని చెబుతున్నారు. కేసు నమోదు కాకుండా ఇద్దరు పోలీస్‌ ఉన్నతాధికారులు, మాజీ ప్రజాప్రతినిధి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)