Breaking News

తనను పెళ్లి చేసుకోవాలని నా భర్తను వేధించింది.. మమత కీలక వ్యాఖ్యలు

Published on Sat, 05/27/2023 - 13:26

సాక్షి, పహాడీషరీఫ్‌: మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి చెరువులో పడేసిన ఘటనలో స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో మృతుడు చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అదృశ్యమైన పూరన్‌ సింగ్‌గా గుర్తించారు. కాగా, పూరన్‌ సింగ్‌పై మృతిలో కీలక ట్విస్ట్‌ చోటుచేసుకుంది. పూరన్‌ సింగ్‌ భార్య సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మృతికి జయదేవీ అనే మహిళే కారణమని చెప్పుకొచ్చారు. 

వివరాల ప్రకారం, పూరన్‌ సింగ్‌ మృతిపై తాజగా ఆయన భార్య మమతా సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. జయదేవీ తనను పెళ్లి చేసుకోవాలని నా భర్త వెంట పడుతోంది. ఆయన్ను వేధింపులకు గురిచేసింది. నన్ను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని నా భర్తను గత కొద్దిరోజులుగా బెదిరిస్తోంది. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని వార్నింగ్‌ ఇచ్చింది. నా భర్తను జయదేవీనే కిరాతకంగా చంపేసింది. పూరన్‌ సింగ్‌ను ట్రాప్‌ చేసి ప్లాన్‌ ప్రకారమే హత్య చేసింది అని కామెంట్స్‌ చేశారు. 

అంతకు ముందు, ఇన్‌స్పెక్టర్‌ కాశీ విశ్వనాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 25న సాయంత్రం చెరువులో మృతదేహం లభ్యం కావడంతో పరిసర పోలీస్‌స్టేషన్లలో అదృశ్యమైన కేసులను పరిశీలించారు. చాంద్రాయణగుట్ట పరిధిలోని కేసుగా పోలీసులు నిర్ధారించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన దీన్‌ దయాళ్‌ కుమారుడు పూరన్‌సింగ్‌ (30) హైదరాబాద్‌కు వలస వచ్చి చాంద్రాయణగుట్టలోని బండ్లగూడ పటేల్‌నగర్‌లో పానీపూరి బండి నడుపుకొంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. 

ఈ నెల 22న రాత్రి 10 గంటలకు బార్కాస్‌లోని వివాహానికి హాజరవుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ రావడం.. స్థానికంగా గాలించినా ఫలితం లేకపోవడంతో అతని భార్య మమతా సింగ్‌ 23న రాత్రి 7 గంటలకు చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మృతుడి వివరాలు తెలియరావడంతో పూరన్‌సింగ్‌కు ఉన్న విబేధాల విషయమై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. 

ఇది కూడా చదవండి: మాజీ మంత్రి నవ కిషోర్‌ దాస్‌ హత్యలో కీలక పరిణామం

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)