Breaking News

విద్య, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం

Published on Thu, 02/19/2026 - 04:21

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం విద్య, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఈ రంగాల వృద్ధికి ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం సచివాలయంలో సంక్షేమ శాఖలు, రోడ్డు రవాణా, నీటిపారుదల శాఖ, సివిల్‌ సప్లయీస్, రోడ్లు–భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల ప్రీ బడ్జెట్‌ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీన్‌ శాఖల వారీ సమీక్షల్లో పాల్గొన్నారు. 

నిబద్ధతతో ప్రాధాన్యతను గుర్తించి, ఆదాయం ఖర్చుపై దృష్టి సారించి బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సంక్షేమ శాఖలకు సంబంధించి వసతి గృహాలు, గురుకులాల బిల్లులు వేగవంతంగా క్లియర్‌ చేస్తామని, వసతి గృహాల భవనాల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. 

వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ స్కూల్‌ భవనాలపైన సోలార్‌ పవర్‌ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, విద్యుత్‌ శాఖ ముఖ్యకార్యదర్శితో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని గురుకుల సొసైటీ అధికారులను ఆదేశించారు. వసతి గృహాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నందున, జిల్లా అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు వసతి గృహాలను సందర్శించి తనిఖీలు నిర్వహించాలన్నారు.  

రాష్ట్రంలో వరి సాగు పెద్ద ఎత్తున చేయడం, బాయిల్డ్‌ రైస్‌ను తమిళనాడు వంటి రాష్ట్రాలు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో భవిష్యత్‌లో రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని, దీంతో పంట మార్పిడికి అవకాశాలను పరిశీలించాలని మంత్రి ఉత్తమ్‌ సూచించారు. వరి స్థానంలో పామాయిల్, పప్పుధాన్యాలు సాగు చేస్తూ, పంట నిల్వ సామర్థ్యాన్ని రాష్ట్రంలో   పెంచాల్సిన అవసరం ఉందన్నారు.  

ఈసారి బడ్జెట్‌లో బీసీలకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి, ఆర్థికావృద్ధి సాధించడానికి ప్రత్యేక పథకాలు ప్రారంభించాలని మంత్రి పొన్నం ప్ర భాకర్‌ సూచించారు. త్వరలోనే ఆర్టీసీలో ప్రయాణించే మహిళలకు మహా లక్ష్మి కార్డులను అందిస్తామన్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)