Breaking News

వారసత్వ అధ్యయనాల్లో రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలుపుదాం

Published on Fri, 12/12/2025 - 05:12

సాక్షి, హైదరాబాద్‌: వారసత్వ అధ్యయనాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్ర మార్క అన్నారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ ఆర్‌డీ)లో జరిగిన ‘దక్షిణ భారతదేశ నాణేలు మరియు ఆర్థిక వ్యవస్థ’ అనే అంశంపై న్యూ మిస్‌ మ్యాటిక్స్‌ సొసైటీ ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. వారసత్వ ఆధారిత పరిశోధనకు తెలంగాణ ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు. 

పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు నాయకత్వంలో మన రాష్ట్రాన్ని శాస్త్రీయ అధ్యయనం, సంస్కృతి సంరక్షణ హబ్‌గా తీర్చిదిద్ద డంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉందన్నారు. దక్షిణ భారతదేశానికి అత్యంత సమృద్ధిగా నాణేల పరంపర ఉందని, శాతవాహనులు, ఇక్ష్వాకులు తమ వాణిజ్య నెట్‌వర్క్‌లను నాణేల ద్వారా విస్తరించగా, కాకతీయుల నుంచి విజయన గర సామ్రాజ్యపు వైభవం వరకు మన ప్రాంతపు నాణేలు ఆవిష్కరణ, కళాత్మకత, రాజ్యపాలనకు ప్ర తీకగా నిలిచాయని చెప్పారు. 

ఈ సదస్సు స్వతహా గానే చరిత్రాత్మకమైనదని, వారసత్వ శాఖ ఇంతకు ముందు పురావస్తు, మ్యూజి యంల శాఖ 114 ఏళ్ల ప్రయాణంలో తొలిసారిగా నాణేలపై మాత్రమే జాతీయ సదస్సును నిర్వహించడం అభినందనీయ మన్నారు. ఈ సదస్సు రెండురోజులు జరిగే కార్యక్ర మంగా మాత్రమే కాకుండా, కొత్త ఆలోచనలను రగిలించే వేదిక కావాలన్నారు. న్యూ మిస్‌ మ్యా టిక్స్, వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ ముందంజలో నిలవాలని భట్టి ఆకాంక్షించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)