కన్నతల్లే కర్కశురాలై..

Published on Wed, 12/17/2025 - 07:42

మేడ్చల్ జిల్లా: కుటుంబ కలహాలు..క్షణికావేశం..ఓ చిన్నారి ప్రాణం తీసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే హంతకురాలైంది. తన ఏడేళ్ల బిడ్డను అపార్టుమెంట్‌ మూడో అంతస్తు పైనుంచి కిందకు విసిరేసి దుర్మార్గానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వసంతపురి కాలనీలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ మేరకు మంగళవారం ఇన్‌స్పెక్టర్‌ బి.సత్యనారాయణ తెలిపిన మేరకు..వసంతపురి కాలనీలోని గురుకృప అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్తులో డేవిడ్, మోనాలిసా దంపతులు నివసిస్తున్నారు. వీరికి పదేళ్ల కుమారుడు, ఏడేళ్ల వయసున్ను కుమార్తె షరోన్‌ మేరీ ఉన్నారు.

 మేరీ స్ధానిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నది. మోనాలిసా ఒక మత ప్రచార సంస్ధలో పనిచేస్తుండగా, డేవిడ్‌ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ ఇటీవల ఇంటి వద్దనే ఉంటున్నాడు. గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నుంచి వీరిద్దరు గొడవ పడుతున్నట్లుగా తెలిసింది. సోమవారం సాయంత్రం షరోన్‌ మేరీ తన తల్లి మొబైల్‌ ఫోన్‌ చూస్తుండగా ఆగ్రహించిన మోనాలిసా ఒక్కసారిగా బాలికను పైనుంచి కిందకు విసిరేసిందని భర్త డేవిడ్‌ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన మేరీని స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. భర్త డేవిడ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

భిన్న వాదనలు.. 
చిన్నారి మృతికి భార్యా భర్తల మధ్య కలహాలా..లేక దేవుడిపై నమ్మకం విషయంలో తలెత్తిన విభేదాలా అని స్థానికంగా భిన్నకథనాలు విని్పస్తున్నాయి. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వారు మాత్రం మోనాలిసా రోజూ డ్యూటీకి వెళ్లి వచ్చేదని, ఆమె మానసిక స్థితి బాగాలేదన్న విషయం తమకు తెలియదంటున్నారు. అప్పుడప్పుడు పిల్లలు ఏమైనా వస్తువులు కిందకు పడేస్తుంటారని, అదే విధంగా ఆదివారం కూడా ఏమైనా పడేశారేమోనని చూస్తే చిన్నారి రక్తం మడుగులో కనిపించందని ఓ వృద్ధురాలు తెలిపింది. ఆమె మానసిక స్థితి బాగాలేదని బంధువులు చెబుతున్నప్పటికీ, కుటుంబ సభ్యులు, భర్త ఫిర్యాదులో ఆ విషయాన్ని తెలియజేయలేదని, దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడవుతాయని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)