Breaking News

బండి భగీరథ్‌కు బెయిల్‌ మంజూరు

Published on Sat, 06/20/2026 - 13:01

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్‌ మంజూరైంది. మల్కాజ్‌గిరి కోర్టు భగీరథ్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. కాగా, రెండు వారాలకుపైగా రిమాండ్‌లో ఉన్న బండి భగీరథ్‌కు బెయిల్‌ రావడంతో బయటకు రానున్నాడు. అయితే బెయిల్‌కు సంబంధించిన షరతులను తప్పనిసరిగా పాటించాలని న్యాయస్థానం స్పష్టం చేసినట్లు సమాచారం.

మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండి భగీరథ్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణల ఆధారంగా పోలీసులు POCSO చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్‌ను పోలీసులు కోర్టు ముందు హాజరుపరచగా, న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు.

ఈ నేపథ్యంలో భగీరథ్ తరపు న్యాయవాదులు మల్కాజ్‌గిరి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై శనివారం కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. భగీరథ్ తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపిస్తూ బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న గౌరవ న్యాయస్థానం.. కొన్ని నిబంధనలతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ రావడంతో భగీరథ్ జైలు నుంచి విడుదల కానున్నారు.
 

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)