Breaking News

Malakpet Sireesha: శిరీష కేసులో ఊహించని ట్విస్ట్..!

Published on Thu, 03/06/2025 - 07:05

హైదరాబాద్‌: చాదర్‌ఘాట్‌ పీఎస్‌ పరిధిలో జరిగిన వివాహిత శిరీష హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. గుండెపోటుతో తన భార్య చనిపోయిందని చెప్పి ఆమె మృతదేహాన్ని తరలించడానికి భర్త చేసిన యత్నాన్ని భగ్నం చేసిన చాదర్‌ఘాట్‌ పోలీసులు.. శిరీషను ఆమె ఆడపడుచు (భర్త సోదరి) హత్య చేసినట్లు గుర్తించారు. శిరీషను హత్య చేసిన ఆడపడచు, సహకరించిన భర్త, అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

బుధవారం మలక్‌పేట ఏసీపీ శ్యాంసుందర్‌ ఈ వివరాలు వెల్లడించారు. 2016లో శిరీష హయత్‌నగర్‌లోని ఓ హాస్పిటల్‌లో పనిచేసే సమయంలో సరిత అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ క్రమంలో సరిత తన సోదరుడు సింగం వినయ్‌కుమార్‌ను పెళ్లి చేసుకోవాలని కోరగా..అందుకు అంగీకరించి పెళ్లి చేసుకుంది. తరువాత శిరీష కాచిగూడలోని మరో హాస్పిటల్‌లోనూ పని చేసి అక్కడ కూడా రిజైన్‌ చేశారు. అనంతరం 2024 నవంబర్‌లో శిరీష హయత్‌నగర్‌లోని మరో హాస్పిటల్‌లో నర్సింగ్‌ సూపర్‌వైజర్‌గా చేరింది. 

అదే హాస్పిటల్‌లో సరిత కూడా అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌గా పనిచేస్తుంది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 28న శిరీష తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ మరుసటి రోజు (మార్చి 1న) రాత్రి జమునా టవర్స్‌లోని నివాసానికి వచ్చిన  సరిత ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేశావని శిరీషతో గొడవ పడింది. ఈ క్రమంలో ఆమెను కొట్టి, కింద పడేసి అప్పటికే తన దగ్గర ఉన్న హైడోస్‌ మత్తు మందును బలవంతంగా శిరీషకు ఎక్కించింది. స్పృహ కోల్పోయిన శిరీష ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేయడంతో శిరీష మృతి చెందింది.  

అక్కను రక్షించాలని యత్నించి...
మరుసటి రోజు (మార్చి 2) ఉదయం శిరీష మృతి చెందిన విషయాన్ని సోదరుడు వినయ్, తన మరో సోదరి కుమారుడైన నిహాల్‌కు తెలిపింది. ముగ్గురూ కలిసి సాక్ష్యాధారాలను చెరిపేశారు. అక్కను కేసు నుంచి రక్షించాలని నిశ్చయించుకున్న తరువాత వినయ్‌ కుమార్‌ 108కి ఫోన్‌ చేసి తన భార్య శిరీషకు గుండె నొప్పి వచ్చిందని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

 అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పడంతో మృతదేహాన్ని దహనం చేయడానికి వెంటనే అంబులెన్స్‌లో దోమలపెంటలోని సొంతూరుకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న శిరీష మేనమామ మధుకర్‌ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారి నాటకానికి తెర పడింది. పోలీసుల సూచనలతో అంబులెన్స్‌ డ్రైవర్‌ మృతదేహాన్ని తిరిగి నగరానికి తీసుకు వచ్చాడు. 

పోస్ట్‌మార్టం రిపోర్టులోనూ అమె ఊపిరాడక మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. దాంతో చాదర్‌ఘాట్‌ పోలీసులు శిరీషను హత్య చేసిన ఆడపడచు సరిత, భర్త వినయ్‌కుమార్, అల్లుడు నిహాల్‌ను అరెస్ట్‌ చేశారు. వారి నుండి మూడు సెల్‌ఫోన్లు, హత్యకు ఉపయోగించిన దిండు, బెడ్ షీట్, ఐరన్‌ క్రషర్‌లను స్వా«దీనం చేసుకున్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ ఎం.రాజు, డీఐ భూపాల్‌గౌడ్, ఎస్‌ఐ డి.రవిరాజ్‌ పాల్గొన్నారు.

 

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)