Breaking News

హుస్సేన్‌సాగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

Published on Sun, 01/26/2025 - 21:36

సాక్షి, హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌లో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి బోట్లు చెలరేగి అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. పలువురికి గాయాలయ్యాయి. అయితే.. సకాలంలో సిబ్బంది స్పందించడంతో ప్రాణాపాయం జరగలేదు.  

మహాహారతి కార్యక్రమం ముగింపు సందర్భంగా రాత్రి 9 గంటల సమయంలో హుస్సేన్‌సాగర్‌లో బోట్ల నుంచి బాణసంచా పేల్చుతున్న క్రమంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో బోటులో ఉన్న ఐదుగురూ నీళ్లలోకి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంటల ధాటికి రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనికి కొద్దిక్షణాల ముందే గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు అక్కడి నుంచి వెళ్లారు. 

ఒక జెట్టీలో బాణసంచాను ఉంచి వాటిని పేల్చేందుకు ఐదుగురు సహాయకులు అందులోకి ఎక్కారు. ఈ జెట్టీని మరో బోటుకు కట్టి సాగర్‌లోకి తీసుకెళ్లి బాణసంచా పేల్చడం మొదలుపెట్టారు. రాకెట్‌ పైకి విసిరే క్రమంలో అది అక్కడే బాణసంచాపై పడి పేలడంతో మంటలు చెలరేగాయి. గణపతి అనే వ్యక్తికి తీవ్ర గాయాలై అపస్మారకస్థితిలో ఉండగా... సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలవ్వగా, గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు.
 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)