Breaking News

ఈసారైనా వ్యూహం ఫలించేనా?

Published on Wed, 10/25/2023 - 08:04

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో పాగా వేసేందుకు మజ్లిస్‌–బచావో –తహరిక్‌ (ఎంబీటీ) పార్టీ వ్యూహత్మకంగా అడుగులేస్తోంది. మూడు దశాబ్దాల కిందటి వైభవం కోసం పడరాని పాట్లు పడుతోంది. రాజకీయ శత్రుపక్షమైన ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఏ–ఇత్తేహదుల్‌ ముస్లిమీ(ఏఐఎంఐఎం)ను మట్టి కరిపించడమే లక్ష్యంగా శక్తియుక్తులను ఒడ్డుతోంది. మజ్లిస్‌ తరహాలో నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైనా ఎన్నికలలో ఆ పారీ్టకి పరాభవం తప్పడం లేదు. ఎప్పటి మాదిరిగా పార్టీ సీనియర్‌ బాధ్యులను కాకుండా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విద్యావంతులైన యువతకు పెద్ద పీట వేసి కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనైనా పాగా వేయాలని యోచిస్తోంది. 

ప్రధానంగా మజ్లిస్‌ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు పాతబసీలో అక్షరాస్యత, అభివృద్దిపై ఫోకస్‌ పెట్టి ఓటర్లను తమ  వైపు తిప్పుకునేందుకు ఎంబీటీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ముస్లిం సామాజికవర్గంలో మార్పు కోసం ఎన్నికల బరిలో దిగేందుకు విద్యావంతులైన యువకులు ముందుకు రావాలని పిలుపునిస్తోంది. ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్, మెడికల్‌ రంగాలకు చెందిన యువత ముందుకు వచ్చి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే వరకు వ్యవస్థను సరిదిద్దలేమని పేర్కొంటోంది. పోటీకి ఆసక్తిగల అభ్యర్థులు పాతబస్తీ చంచల్‌గూడలోని ఎంబీటీ ప్రధాన కార్యాలయంలో సంప్రదించాలని సూచిస్తోంది. 

పట్టు వదలకుండా.. 
పాతబస్తీలో మజ్లిస్‌ పార్టీని దెబ్బతీసి గట్టెక్కేందుకు ఎంబీటీ పట్టు వదలని విక్రమార్కునిలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గతంలో పార్టీ ప్రాతినిధ్యం వహించిన చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా అసెంబ్లీ స్థానాలు దక్కించుకునేందుకు వరుసగా ఎన్నికల్లో ప్రయతి్నస్తూ విఫలమవుతోంది. మూడు దశాబ్దాల క్రితం అప్పటి ఎఐఎంఐఎం అధినేత  సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీతో ఏర్పడ్డ విభేదాలతో అమానుల్లాఖాన్‌ నాయకత్వంలో 1993లో ఏర్పడిన మజ్లిస్‌–బచావ్‌ తహరీక్‌ (ఎంబీటీ) 1994లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొలి విజయం సాధించింది. మజ్లిస్‌ కంచు కోటలైన చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా అసెంబ్లీ స్థానాల్లో ఎంబీటీ విజయకేతనం ఎగురవేసింది. 

అయితే 1999 ఎన్నికల్లో ఎంబీటీ తన బలాన్ని నిలుపుకోలేకపోయింది. రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. పార్టీ అధినేత అమానుల్లా ఖాన్‌ వరుసగా ఐదు పర్యాయాలు విజయం సాధించిన చాంద్రాయణగుట్ట నుంచి ఓటమి చవిచూడక తప్పలేదు. మరోవైపు ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్, విరాసత్‌ రసూల్‌ ఖాన్‌ కూడా ఎంఐఎం గూటికి చేరారు.

ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చాంద్రాయణ గుట్ట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి క్రమంగా అమానుల్లాఖా¯న్‌ పెద్ద కుమారుడు ఖయ్యూంఖాన్, యాకుత్‌పురా నుంచి ఫర్హాతుల్లా ఖాన్, మిగతా నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు బరిలో దిగి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చాంద్రాయణగుట్ట సెగ్మెంట్‌పై ఆశలు వదలుకొని యాకుత్‌పురాపై దృష్టి సారించినా..అక్కడా పరాభవం తప్పలేదు. అయితే ఈసారి సరికొత్త వ్యూహంతో విద్యావంతులైన యువతను రంగంలోని దింపాలని మరోమారు ఎంబీటీ గెలుపు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)