Breaking News

నేరస్తులపై నిఘా పెంచండి

Published on Wed, 08/23/2023 - 02:09

సాక్షి,హైదరాబాద్‌:నేరాలకు పాల్పడుతున్నవారిపై నిఘా పెంచాలని, అవసరమైతే రౌడీషిటర్లపై పీడీయాక్ట్‌ కింద కేసులు నమోదు చేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులను రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ ఆదేశించారు. చీకటి ప్రదేశాల్లో, భారీ నిర్మాణాల దగ్గర సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, ఫ్లై ఓవర్లు, పాఠశాలల వద్ద మద్యం, గంజాయి సేవించడంపై నిఘా ఉంచాలని సూచించారు.

హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్‌ ట్రై–పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో నమోదవుతున్న నేరాలు, హత్యలపై హోంమంత్రి మంగళవారం డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయంలోని తన కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో డీజీపీ అంజనీకుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్, కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్‌ రవీంద్ర, డీఎస్‌ చౌహాన్, సీఐడీ అడిషనల్‌ డీజీ మహేశ్‌ భగవత్‌ పాల్గొన్నారు. హోంమంత్రి మాట్లాడుతూ చాంద్రాయణగుట్ట, పహాడీషరీఫ్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్‌ పాతబస్తీలోని ఫంక్షన్‌ హాళ్లు, హోటళ్లు, జిమ్‌లు, పాన్‌ షాప్‌లు ప్రభుత్వం నిర్దేశించిన సమయాల ప్రకారం మూతపడేలా చూడాలని సూచించారు.

వాట్సాప్, ఇతర సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే సందేశాలను కొన్ని గ్రూపులు ప్రబలంగా ప్రసారం చేస్తున్నాయని, దీని ఫలితంగా ప్రజలలో తప్పుడు ప్రచారాలు జరిగే అవకాశం ఉందని హోంమంత్రి అన్నారు. ఫంక్షన్‌ హాళ్లలో అర్ధరాత్రి వరకు గడపవద్దని ప్రజలను కోరారు. విధి నిర్వహణలోని పోలీసులకు ప్రజలు సహకరించాలని, భద్రత కోసం ప్రజలకు సేవ చేయడానికి పోలీసులకు చేయూతనివ్వాలన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)