Breaking News

పీసీసీ అధ్యక్షుడిగా నేడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ బాధ్యతలు

Published on Sun, 09/15/2024 - 06:02

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బొమ్మా మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 2:45 నిమిషాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి నుంచి మహేశ్‌గౌడ్‌ బాధ్యతలు తీసుకుంటారని గాం«దీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ సమీపంలో గన్‌పార్కు వద్దకు రానున్న మహేశ్‌గౌడ్‌ అమరవీరులకు నివాళులరి్పస్తారని, అక్కడి నుంచి వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా గాం«దీభవన్‌కు చేరుకుంటారని తెలిపాయి.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం గాం«దీభవన్‌లో సభ జరగనుంది. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, పెరుమాళ్‌లతో పాటు రాష్ట్ర కేబినెట్‌లోని మంత్రులు హాజరుకానున్నారు.  

ముస్తాబైన గాందీభవన్‌.. 
కాగా, పీసీసీ నూతన అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ కోసం గాంధీభవన్‌ ముస్తాబైంది. గత నాలుగు రోజులుగా గాం«దీభవన్‌కు రంగులు వేసే కార్యక్రమం పూర్తయింది. సభ నిర్వహణ కోసం కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఫిషర్‌మెన్‌ సొసైటీ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌తో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పీసీసీ కొత్త అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పాల్గొంటుండటంతో పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)