Breaking News

పటిష్టంగా గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్.. ఏర్పాట్లను పరిశీలించిన మహేష్ భగవత్‌

Published on Wed, 12/03/2025 - 23:45

సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి భద్రతా ఏర్పాట్లను వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ ఈరోజు ఫ్యూచర్ సిటీలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపిఎస్, ఐజీ రమేష్ రెడ్డి తదితరులతో కలిసి ఆయన సమావేశ ప్రాంగణాన్ని పరిశీలించారు.

అనంతరం మహేష్ భగవత్ మాట్లాడుతూ.. బందోబస్తులో ఎలాంటి లోపం ఉండకూడదని, అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ సమ్మిట్‌కు 600 మంది దేశీ–విదేశీ ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఇంటెలిజెన్స్, అక్టోపస్, గ్రేహౌండ్స్‌తో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

సమ్మిట్‌ ప్రాంతంలో వెయ్యికిపైగా సీసీటీవీలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయనున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు వెయ్యి మంది సిబ్బందిని మోహరించడంతో పాటు రోడ్ల మార్పులు, బారికేడ్లు, పార్కింగ్ నిర్వహణ కోసం ప్రత్యేక మార్షల్స్‌ను నియమించనున్నారు. రెండు రోజుల పాటు కొన్ని మార్గాల్లో రహదారి మళ్లింపులు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)