Breaking News

మెట్ల బావులకు పూర్వవైభవం!

Published on Fri, 01/10/2025 - 05:10

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పూడికతో ఉనికి కోల్పోయిన మెట్ల బావులకు మహర్దశ కలిగింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని నాగన్నగారి బావి, భిక్కనూరు మండల కేంద్రంలోని సిద్దరామేశ్వరాలయం వద్ద ఉన్న మెట్ల బావులకు అప్పటి కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ చొరవతో పూర్వ వైభవం చేకూరింది. దీంతో పర్యాటకులు వాటిని సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని మెట్ల బావులు ఉనికి కోల్పోతున్న విషయమై ‘సాక్షి’ అక్షర సమరం సాగించింది. 

2022 జనవరి 29న లింగంపేటలోని నాగన్న బావి ఉనికి కోల్పోతున్న వైనంపై ‘మెట్ల బావిలో నిర్లక్ష్యపు పూడిక’ శీర్షికన, తరువాత వరుసగా ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలతో అప్పటి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ స్పందించారు. నాగన్నగారి బావిని సందర్శించిన కలెక్టర్‌.. గ్రామస్తులతో కలిసి ముళ్ల పొదలు, చెట్లను తొలగించడంతో మొదలైన పనులు.. పూడిక తొలగించే వరకు కొనసాగింది. 

రెయిన్‌ వాటర్‌ ప్రాజెక్టు అనే స్వచ్ఛంద సంస్థ ఫౌండర్‌ కల్పనా రమేశ్‌తో మాట్లాడి.. వారి సహకారంతో దానికి పూర్వవైభవం తీసుకువచ్చారు. భిక్కనూరు మండల కేంద్రంలోని సిద్దరామేశ్వరాలయ ప్రాంగణంలో మరుగున పడిన మెట్ల బావిని అద్భుతంగా తీర్చిదిద్దారు. మెట్ల బావి వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతూ పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. 

సిద్దరామేశ్వరా లయం దర్శనానికి వెళ్లిన వారంతా.. మెట్ల బావి కట్టడాన్ని చూసి అబ్బురపడుతున్నారు. ఫొటోలు దిగుతున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో రెండు మెట్ల బావులు, రాజంపేట మండల కేంద్రంలో ఒకటి, లింగంపేట మండలం శెట్పల్లి, నాగిరెడ్డిపేట మండలం మాటూరు గ్రామాల్లో మెట్ల బావులను   గుర్తించి.. వాటిలో పేరుకుపోయిన పూడికను తొలగించి పూర్వవైభవం తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోంది.

నాగన్నగారి బావిని సందర్శించిన ‘జూపల్లి’
లింగంపేట మండల కేంద్రంలోని నాగన్నగారి బావిని గత నెలలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యే మదన్‌మోహన్‌తో కలిసి సందర్శించారు. మెట్ల బావికి పూర్వవైభవం తేవడాన్ని అభినందించారు. పర్యాటక శాఖ ద్వారా మరింత వైభవం తీసుకొస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గతంలో పనిచేసిన కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ప్రత్యేక శ్రద్ధతో పూర్వవైభవం వచ్చింది. 

ప్రస్తుత కలెక్టర్‌ ఆశీష్‌ సంగ్వాన్‌ దానికి మరింత వన్నె తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని మిగతా మెట్ల బావులను కూడా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెట్ల బావులకు పూర్వవైభవం సమకూరడం పర్యాటకులకు ఆనందాన్ని కలిగిస్తోంది.  

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)