Breaking News

మహాలక్ష్మి పథకంతో లాభాల్లోకి ఆర్టీసీ

Published on Mon, 12/22/2025 - 06:14

సాక్షి, హైదరాబాద్‌: మహాలక్ష్మి పథకం వల్ల ప్రజా రవా­ణా సంస్థ లాభాల్లోకి వచ్చిందని ఉప ముఖ్య­మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తమ ప్రభు­త్వం సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు కాస్మొటిక్, మెస్‌ చార్జీలను రెట్టింపు చేసిందని, ప్రతి మూడు నెలలకోమారు ఆ చార్జీలను చెల్లిస్తోందని వెల్లడించా­రు. ఆదివారం ప్రజాభవన్‌లో ఆర్టీ సీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణాశాఖ జేటీసీలు, ఎంజేపీ కార్యదర్శి సైదులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆర్టీసీని బలోపేతం చేసేందుకు, కార్మికులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. సంస్థకు కొత్త బస్సులను సమకూర్చుతున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారం ఉన్నప్పటికీ, సంస్థ సొంతంగా ఆదాయాన్ని పెంచుకునేందుకు చర్యలు తీసు­కోవాలని సూచించారు. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని, మహిళా సాధికారతకు ఇది దోహ­దం చేస్తోందని వెల్లడించారు.

గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ పీఎఫ్‌ బకా­యిలు రూ.1,400 కోట్లు పేరుకుపోగా, తమ ప్రభుత్వం వచ్చాక ఆ మొ­త్తాన్ని రూ.660 కోట్లకు తగ్గించామని, సీసీఎస్‌ బకాయిలను రూ.600 కోట్ల నుంచి రూ.373 కోట్లకు తగ్గించామని తెలిపారు. ఉచిత ప్రయాణాల కోసం ప్రయాణికులకు సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెస్‌తో ఒప్పందం కుదుర్చుకుని ప్రత్యేక కార్డులు రూపొందించి పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రతి మహి­ళకు ఈ కార్డు చేరేలా చూడాలని తెలిపారు. ఎలక్ట్రిక్‌ బస్సుల సంఖ్య పెరుగుతున్నందున, తదనుగుణంగా ఛార్జింగ్‌ స్టేషన్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. గురుకులాలకు సొంత భవనాలను కార్పొరేట్‌ స్థాయిలో నిర్మిస్తున్నట్టు భట్టి వెల్లడించారు.

అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. రెగ్యులర్‌ కండక్టర్‌ పోస్టుల భర్తీకి, చీఫ్‌ ఎకౌంట్‌ ఆఫీసర్‌ పోస్టులకు కూడా అనుమతి ఇవ్వాలని కోరారు. డ్రైవింగ్‌ లైసెన్సుల జారీకి సంబంధించి యూజర్‌ ఛార్జీల వసూలుకు అను­మతి ఇవ్వాలని కోరారు.రవాణాశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కోసం కొత్త వాహనాలు, పన్ను వసూళ్లకు టాబ్స్‌ మంజూరు చేయాలని కోరారు. 

Videos

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)