Breaking News

ప్రేమించిన మరదలితో వివాహం చేయడం లేదని..

Published on Thu, 07/24/2025 - 14:04

కృష్ణా: ప్రేమించిన మరదలితో కుటుంబ సభ్యులు వివాహం చేయడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఇక సెలవు (మిస్‌యూ మా, మిస్‌యూ ఆల్‌ మై ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ) అంటూ తన ఫొన్‌లో స్టేటస్‌ పెట్టి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని చేగుంటలో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల మేరకు.. చేగుంటకు చెందిన సంగెంబండ బస్సప్ప – తిమ్మవ్వ దంపతులకు మల్లప్ప, భీమ్‌రాయ, పరశివ సంతానం. వీరి తల్లి తిమ్మవ్వ కొన్నేళ్ల క్రితం మృతిచెందగా.. మొదటి కొడుకు మల్లప్ప తన భార్యతో కలిసి జీవనోపాధి నిమిత్తం బెంగళూరుకు వలస వెళ్లారు. 

ఆరేళ్ల క్రితం పదో తరగతి పూర్తిచేసుకున్న చిన్నకొడుకు పరశివ (22) కూడా ఉపాధి నిమిత్తం బెంగళూరులోని తన అన్న మల్లప్ప వద్దకు వెళ్లాడు. బెంగళూరులో పరశివ పనిచేసుకుంటూ.. తన రెండో అన్న భీమ్‌రాయ భార్య సునీత చెల్లెలు నిఖితతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరు వరుసకు బావమరదలు కావడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని స్వగ్రామంలో ఉన్న తన సోదరుడు భీమ్‌రాయ, వదిన సునీతకు చెప్పేందుకు గాను వారం రోజుల క్రితం పరశివ బెంగళూరు నుంచి చేగుంటకు వచ్చాడు. ఈ క్రమంలో పరశివ, నిఖిత వివాహానికి అన్న, వదినలు అడ్డు చెప్పారు. ప్రేమించిన యువతి ఆరోగ్యం బాగా లేదని, నీకు మరో అమ్మాయితో వివాహం చేస్తామని పరశివకు సర్దిచెప్పారు. 

ఇక వీరి మాటకు ఎదురు చెప్పలేక తిరిగి బెంగళూరుకు బయలుదేరాడు. ఆదివారం బెంగళూరు నుంచి మళ్లీ బయలుదేరిన పరశివ.. రాష్ట్ర సరిహద్దులోని దేవసూగూర్‌లో గల కృష్ణానది తీరానికి చేరుకున్నట్లు తెలిసింది. అక్కడ తన ఫోన్‌లో ‘మీస్‌యూ ఆల్‌ మై ఫ్రెండ్స్‌, అండ్‌ ఫ్యామిలీ’ అంటూ స్టేటస్‌ పెట్టాడు. అలాగే తాను ప్రేమించిన నిఖితతో దిగిన ఫొటోలు, వీడియోలు స్టేటస్‌లో పెట్టుకొని ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మొదట కృష్ణా, ఆ తర్వాత శక్తినగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. 

అయితే కృష్ణానదిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడేమో అని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానికుల సహాయంతో కృష్ణానదిలో గాలింపు చర్యలు చేపట్టగా.. ఆచూకీ లభించలేదు. యువకుడి అదృశ్యం ఘటనకు సంబంధించి శక్తినగర్‌ ఎస్‌ఐ తిమ్మణ్ణను వివరణ కోరగా.. ఈ విషయంపై బెంగళూరులో కేసు నమోదైందని త తెలిపారు. తాము స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదన్నారు. ఇప్పటికే బెంగళూరులో కేసు నమోదైనందున తాము కేసు చేయలేదని తెలిపారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)