Breaking News

పెళ్లి చేసుకోమని అడిగితే చంపేస్తారా?

Published on Sat, 08/02/2025 - 12:38

వరంగల్‌ లీగల్‌ : ఓ మహిళ తనను వివాహం చేసుకోమని కోరగా కోపోద్రిక్తుడై ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి చంపిన ఘటనలో నేరం రుజువుకావడంతో మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం జమస్తాపురం గ్రామానికి చెందిన నేరస్తుడు చిన్నపాక అనిల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ వరంగల్‌ రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి మనీషా శ్రావణ్‌ ఉన్నవ్‌ శుక్రవారం తీర్పు వెలువరించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జి.సంతోషి కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం ఊకల్‌కు చెందిన పార్వతితో చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్‌కు చెందిన సింగారపు బాబుకు వివాహం జరిగింది. 

కొన్ని సంవత్సరాల అనంతరం బాబు అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. దీంతో పార్వతి రంగశాయిపేటలో అద్దెకుంటూ కూలీ చేసుకుంటూ జీవించేది. పక్కనే అద్దెకుంటున్న చిన్నపాక అనిల్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయమై పార్వతి సోదరులు పలుమార్లు హెచ్చరించినా ఇరువురిలో మార్పు రాలేదు. దీంతో పార్వతిని తన తండ్రి స్వగ్రామం ఊకల్‌కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పార్వతి తండ్రి మృతి చెందడంతో అనిల్‌ ఊకల్‌కు రావడం ప్రారంభించాడు.  2015, జూన్‌ 7న ఊకల్‌కు వచ్చిన అనిల్‌ను తనను వివాహం చేసుకోవాలని పార్వతి నిలదీసింది. దీంతో కోపోద్రిక్తుడైన అనిల్‌.. పార్వతిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. పార్వతి కేకలు విని చుట్టూ పక్కల వారు రాగా అనిల్‌ పరారయ్యాడు. 

పార్వతిని 108లో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పార్వతి సోదరుడు వెంకన్న.. రాయపర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. నేరం రుజువుకావడంతో అనిల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి మనీషా శ్రావణ్‌ ఉన్నవ్‌ తీర్పు వెలువరించారు. కేసును పోలీస్‌ అధికారులు ఎస్‌.శ్రీనివాస్, ఆర్‌.సంతోష్‌ పరిశోధించగా లైజన్‌ ఆఫీసర్‌ హరికృష్ణ పర్యవేక్షణలో హెడ్‌కానిస్టేబుల్‌ సోమనాయక్, కానిస్టేబుల్‌ అనిల్‌ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.    

#

Tags : 1

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)