Breaking News

జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై ఫిర్యాదు

Published on Wed, 01/22/2025 - 05:19

సాక్షి, హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి తనపై కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభాకర్‌ రెడ్డి ఇటీవల చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు తనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయని ఆరోపిస్తూ ఆమె మంగళవారం గచ్చిబౌలిలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో కమిషనర్‌ అవినాష్‌ మహంతికు లేఖ పూర్వకంగా ఫిర్యాదు చేశారు. 

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... నటీమణులు, మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పడం ఆమోదయోగ్యమైన ప్రవర్తనా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తనను ప్రభావితం చేయడమే కాకుండా తన కుటుంబ సభ్యులలో భయాన్ని, బాధను కలిగించాయని అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్‌ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ప్రభాకర్‌ రెడ్డి మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 

ఈ కార్యక్రమానికి ముందు జేసీ పార్క్‌ వద్ద తరచుగా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని, మహిళలు హాజరుకావద్దని మాధవీలత సోషల్‌ మీడియాలో వీడియోను పోస్ట్‌ చేశారు. దీనిపై స్పందించిన ప్రభాకర్‌ రెడ్డి ఆమెపై కించపరిచే వ్యాఖ్యలు చేశారు.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)