Breaking News

ప్రేమకథ విషాదాంతం

Published on Mon, 10/27/2025 - 07:29

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఆ ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. కులాలు వేరైనా యువకుడి తల్లి దండ్రులు అంగీకరించడంతో వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఇంతలోనే నీట మునిగి ఆ యువతి మృతి చెందింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నగర సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన దానవేన రవితేజ సింగరేణిలోని బోరింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్‌ కారి్మకుడిగా పనిచేస్తున్నాడు. 

పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు గ్రామానికి చెందిన మౌనిక(17) పదో తరగతి వరకు చదివి ప్రస్తుతం ఇంటివద్దే ఉంటోంది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా మౌనిక, రవితేజ మధ్య పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. రవితేజను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో తన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మౌనిక నెల క్రితం గోదావరిఖనిలోని రవితేజ ఇంటికి వచ్చింది. అయితే మౌనిక మైనర్‌ కావడంతో 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేయాలని ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఇందుకోసం వచ్చేనెల ఒకటో తేదీన ముహూర్తం నిర్ణయించారు.

 కుల సంప్రదాయం ప్రకారం.. మౌనిక, రవితేజ కుటుంబ సభ్యులతో కలిసి గోదావరి నది స్నానానికి వెళ్లారు. యువతీయువకులిద్దరూ నదిలోకి దిగి ప్రమాదవశాత్తు నీటమునిగారు. అక్కడే ఉన్న జాలర్లు, కుటుంబ సభ్యులు వెంటనే రక్షించేందుకు ప్రయతి్నంచారు. ఈక్రమంలో రవితేజను బయటకు తీయగా, ప్రాణాలతో బయటపడ్డాడు. నీటిలో కొట్టుకుపోతున్న మౌనికను కూడా బయటకు తీయగా అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తల్లి కళ ఇచి్చన ఫిర్యాదు మేరకు సీఐ ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో ఎస్సై అహ్మదుల్లా కేసు నమోదు చేశారు.  

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు