Breaking News

ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..?

Published on Mon, 03/17/2025 - 07:27

జమ్మికుంట(హుజూరాబాద్‌): పరిపక్వతలేని ప్రేమ వ్యవహారం ఇద్దరి ప్రాణం తీసింది. ఇరు కుటుంబాల్లో ఎలాంటి నిర్బంధాలు లేవని, వారి ఫిర్యాదులతో తెలుస్తోంది. అయినా ఎందుకు ప్రాణాలు తీసుకున్నారో తేలాల్సి ఉందనే సందేహం కలుగుతోంది. జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్, పాపయ్యపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై శనివారం రాత్రి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మంచిర్యాల రైల్వే పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ తెలిపిన వివరాలు.. కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన మెనుగు రాహుల్‌ (18)కు నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం ఏరుచింతల గ్రామానికి చెందిన గోలేటి శ్వేత(20)తో పరిచయం ఏర్పడింది. 

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫెయిల్‌ అయిన రాహుల్‌ హైదరాబాద్‌లో ఎల్‌ఈడీ బల్బస్‌ ఈవెంట్‌ వర్క్స్‌ చేస్తుంటాడు. ఇంటర్‌ సప్లిమెంటరీ ఎగ్జామ్‌ రాసి ఇంటికి వద్ద ఉంటున్నాడు. శ్వేత కరీంనగర్‌లోని ఉమెన్స్‌ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. శివరాత్రి పండుగకు ఇంటికి వెళ్లిన శ్వేత ఇటీవల కరీంనగర్‌ కళాశాలకు వచ్చింది. కాగా శనివారం రాత్రి ఇద్దరూ జమ్మికుంట మండలం పాపయ్యపల్లి శివారులోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడేందుకు సిద్ధపడ్డారు. 

గూడ్స్‌ డ్రైవర్‌ హారన్‌ మోగించినా పట్టాల పైనుంచి జరగకుండా ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీస్‌ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. వీరి మధ్య ప్రేమ ఎక్కడ, ఎలా చిగురించిందో తెలియదుగానీ, ఇద్దరూ ఏ నిర్బంధాలు లేకుండానే సున్నిత మనస్తత్వంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రేమ వ్యవహారం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని రాహుల్‌ తండ్రి రాజు ఫిర్యాదు ఇవ్వగా.. ఏ కారణంతో చనిపోయిందో తెలియదని మృతురాలి తండ్రి రాజలింగు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఏదిఏమైనా ఇద్దరి ఆత్మహత్య ఘటన కారణాలు లేకుండా మిస్టరీగా మారింది. ఇద్దరి మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఆత్మహత్యలపై రైల్వే పోలీస్‌ విచారణలో తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మంచిర్యాల రైల్వే పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్, రామగుండం రైల్వే పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ గంగారపు తిరుపతి ఆదివారం తెలిపారు.

    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)