Breaking News

పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదనే...

Published on Sat, 01/11/2025 - 07:13

మునిపల్లి(అందోల్‌)/­నారాయణ­ఖేడ్‌: పెళ్లికి పెద్దలు అంగీకరించడం లేదంటూ ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం సింగూరు ప్రాజెక్టు హరిత రిసార్ట్‌లో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం..నిజాంపేటకు చెందిన కరిపే ఉదయ్‌కుమార్‌ (21), మంగలి రోహిత(19) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలకు చెందినవారు అంగీకరించలేదు.

ఈ క్రమంలో గురువారం ఉదయ్, రోహితలు సింగూరు ప్రాజెక్టు సమీపంలోని హరిత రిసార్ట్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఒకే ఫ్యాన్‌కు ఇద్దరూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ప్రేమజంట ఆత్మహత్య విషయం రిసార్ట్‌ నిర్వాహకులకు శుక్రవారం తెలిసింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ రాసి ఉంచిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ ప్రేమకు తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు అందులో పేర్కొన్నట్టు తెలిసింది. 

ఉదయ్‌కుమార్‌ది మిర్చి వ్యాపారం కాగా, రోహిత నారాయణఖేడ్‌లోని మోడల్‌ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (బీజెడ్‌సీ) ఫైనలియర్‌ చదువుతోంది. గురువారం ఆమె క్లాసులకు హాజరు కాలేదు. శుక్రవారం ఉదయం రోహిత తండ్రి దుర్గేష్‌ కళాశాలకు ఫోన్‌ చేసి కూతురు ఆచూకీ గురించి ఆరా తీసినట్టు తెలిసింది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. కాగా ఉదయ్‌కుమార్‌ తండ్రి బాల్‌కిషన్‌ కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హరిత రిసార్ట్‌ మేనేజర్‌ సాంబశివరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ రాజేశ్‌నాయక్‌ తెలిపారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)