స్థానిక పోరుకు సైరన్‌

Published on Tue, 09/30/2025 - 01:10

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఐ.రాణీకుముదిని సోమవారం విడుదల చేశారు. తొలుత మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సమరం మొత్తం ఐదు దశల్లో జరగనుంది. మండల, జిల్లా పరిషత్‌ల తొలి విడత ఎన్నికలు అక్టోబర్‌ 23న, రెండో విడత అదే నెల 27న జరగనున్నాయి. గ్రామ పంచాయతీల మొదటి దశ ఎన్నికలు అక్టోబర్‌ 31న, రెండో విడత నవంబర్‌ 4న, మూడో దశ ఎన్నికలు అదే నెల 8న జరగనున్నాయి. 

మొత్తం మీద అక్టోబర్‌ 9న మొదటి దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీతో మొదలయ్యే స్థానిక ఎన్నికల ప్రక్రియ, నవంబర్‌ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల వెల్లడితో ముగియనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓట్ల కౌంటింగ్‌ (రెండు దఫాలకు) నవంబర్‌ 11న నిర్వహిస్తారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ఏ రోజుకు ఆ రోజు సాయంత్రమే చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. షెడ్యూల్‌ విడుదల చేసిన వెంటనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో (హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి అర్బన్‌ జిల్లాలు మినహా) ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎలక్షన్‌ కోడ్‌) అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ప్రకటించారు.  


మొత్తం ఐదు దశలు.. 
స్థానిక ఎన్నికల ఒక్కో దశను 15 రోజుల్లోగా ముగించేలా చర్యలు చేపడుతున్నామని ఎన్నికల కమిషనర్‌ రాణీ కుముదిని చెప్పారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కార్యాలయంలో డీజీపీ జితేందర్, లా అండ్‌ ఆర్డర్‌ డీజీ మహేశ్‌ భగవత్,పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్, పీఆర్‌ఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన, ఎస్‌ఈసీ కార్యదర్శి మంద మకరందలతో కలిసి ఆమె స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. 31 జిల్లాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీల ఖాళీల వివరాలతో కూడిన గెజిట్‌ను అధికారులు విడుదల చేశారని తెలిపారు. 

ఒక్కో దశకు ఆయా తేదీలను బట్టి ఎక్కడికక్కడ రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేస్తారని చెప్పారు. ఇవి జారీ అయిన రోజు కలిపి మొత్తం మూడురోజుల పాటు అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. హైకోరు ్టస్టే ఉత్తర్వులకారణంగా..14 ఎంపీటీసీ, 27 గ్రామపంచాయతీలు, 246 వార్డులకు ఎన్నికలు జరపడం లేదన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలు, 25 గ్రామపంచాయతీలు, 230 వార్డులకు, కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలంలోని కుర్మపల్లి, రామచంద్రాపూర్‌ పంచాయతీలు, వీటిలోని 16 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం లేదని కమిషనర్‌ తెలియజేశారు.  

Videos

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)