Breaking News

రుణం.. కాదిక సులభం!

Published on Fri, 04/25/2025 - 03:23

డబ్బు అవసరం ఉంది.. సులభంగా వ్యక్తిగత రుణం తీసుకోవచ్చనుకుంటే కుదరదిక. రుణాల మంజూరులో ఆర్థిక సంస్థలు కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వ్యాపారాన్ని, వినియోగదార్ల సంఖ్యను పెంచుకోవడానికి గతంలో ఇబ్బడిముబ్బడిగా రుణాలు ఇచ్చిన సంస్థలు రూట్‌ మార్చాయి. మార్కెట్‌ ఆశాజనకంగా లేకపోవడంతో తాము ఇచి్చన రుణాలు నిరర్ధక ఆస్తులుగా (ఎన్‌పీఏ) మారకూడదని జాగ్రత్త పడుతున్నాయి. 

ఎన్‌పీఏల రిస్క్‌ నుంచి బయటపడేందుకు క్రెడిట్‌ స్కోర్‌ను నిక్కచ్చిగా పాటిస్తున్నాయి. ముప్పు తక్కువగా ఉన్న కస్టమర్లకే లోన్స్‌ మంజూరు చేస్తున్నాయి. మరికొన్ని రుణ సంస్థలు ఒక మెట్టు దిగినప్పటికీ వాహనాలు, కన్యూమర్‌ డ్యూరబుల్స్‌ విషయంలో తక్కువ మొత్తం మంజూరు చేయడం లేదా డౌన్‌పేమెంట్‌ అధికంగా వసూలు చేయడం లాంటివి చేస్తున్నాయి.   – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

కంపెనీల సేఫ్‌ గేమ్‌
క్రెడిట్‌ హిస్టరీ లేనివారు.. అంటే తొలిసారిగా రుణం తీసుకోవాలనుకునే వారిని కంపెనీలు అంత సులభంగా కనికరించడం లేదు. న్యూ టు క్రెడిట్‌ (ఎన్‌టీసీ) విభాగంలో రెండేళ్లలో లోన్‌ పొందిన కస్టమర్ల సంఖ్య 54.5% తగ్గిందంటే కంపెనీల సేఫ్‌ గేమ్‌ను అర్థం చేసుకోవచ్చు. క్రెడిట్‌ స్కోర్‌ 730లోపు ఉన్న వినియోగదార్లకు జారీ చేస్తున్న రుణాల సంఖ్య సైతం క్షీణించింది. 

రెండేళ్లలో వీరి వాటా 42 నుంచి 36 శాతానికి వచి్చంది. అదే సమయంలో 731 మించి క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న కస్టమర్లు 58 నుంచి 64 శాతానికి చేరారు. అంతేకాదు ఏడాదిలో సగటు వ్యక్తిగత రుణ మొత్తాన్ని 2024 డిసెంబర్‌ నాటికి 20% తగ్గించి రూ.44,000కు చేర్చడం పరిస్థితికి అద్దం పడుతోంది. 2023 డిసెంబర్‌ నాటికి ఈ మొత్తం రూ.55,000 ఉండేది.  

చిన్న రుణాల్లో ఫిన్‌టెక్‌ హవా 
భారత్‌లో 2024 డిసెంబర్‌ నాటికి ఫిన్‌టెక్‌ కంపెనీలు మంజూరు చేసిన రుణాల మొత్తం రూ.1,30,000 కోట్లు. దేశంలోని మొత్తం రుణ పరిశ్రమలో ఫిన్‌టెక్‌ సంస్థల వాటా కేవలం 1.03 శాతమే. అయినా ఈ కంపెనీలు జారీ చేసిన రుణాలు ఏడాదిలో 32% వృద్ధిని నమోదు చేశాయి. రూ.50,000లోపు విలువ చేసే వ్యక్తిగత రుణాల్లో ఖాతాల సంఖ్య పరంగా ఫిన్‌టెక్‌ కంపెనీల వాటా ఏకంగా 89 శాతం ఉంది. 

ఇక ఫిన్‌టెక్‌లు ఇస్తున్న పర్సనల్‌ లోన్స్‌లో తక్కువ విలువ చేసే (రూ.50 వేల లోపు) ఖాతాలు 92 శాతం నమోదు చేశాయి. ఈ కంపెనీలు యువత లక్ష్యంగా మారుమూల పల్లెలకూ విస్తరించాయనడానికి ఈ అంకెలే నిదర్శనం. ఫిన్‌టెక్‌ సంస్థలు వినూత్న సాంకేతికతను ఉపయోగించి ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, మొబైల్‌ చెల్లింపులు, వ్యక్తుల నుంచి వ్యక్తులకు (పీర్‌–టు–పీర్‌ లెండింగ్‌) రుణాల వంటి సేవలను ఆఫర్‌ చేస్తున్నాయి.  

2024 డిసెంబర్‌ నాటికి  భారత్‌లో రిటైల్‌ రుణాలు ఇలా..
పరిశ్రమ
మొత్తం రుణాలు రూ.1,26,48,000 కోట్లు
రెండేళ్లలో వృద్ధి: 52%
కస్టమర్లు: 27.8 కోట్లు

ఫిన్‌టెక్‌
మొత్తం రుణాలు రూ.1,30,000 కోట్లు 
రెండేళ్లలో వృద్ధి: 145%
కస్టమర్లు: 2.33 కోట్లు  

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు