Breaking News

హలీం, మటన్‌ బిర్యానీలకు 'మెస్సీ' ఫిదా

Published on Sun, 12/14/2025 - 07:31

సాక్షి, హైదరాబాద్‌: ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీ మన హైదరాబాదీ వంటకాల రుచి చూశారు. హై­దరాబాదీ బిర్యానీ, హలీమ్‌కు ఫిదా అయ్యారు. భారత దేశ పర్యటనలో భాగంగా శనివారం భాగ్యనగరానికి వచ్చిన మెస్సీ.. తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బస చేశారు. కుటుంబంతో కలిసి వచ్చిన ఆయన ప్యాలెస్‌లోని నిజాం లగ్జరీ సూట్‌లో గడిపారు. ఉప్పల్‌లో ఫ్రెండ్లీ మ్యాచ్‌ అనంతరం రాత్రి విందులో ఆయన హైదరాబాదీ మటన్‌ బిర్యానీ అరగించారు. అలాగే ఆయనకు హలీమ్‌ను వడ్డించారు. 

ఇవేగాకుండా నిజాం వంటకాలైన మరగ్, పాయా, కబాబ్, పన్నీర్‌ టిక్కా, దాల్, నాన్‌ రోటీలు, ఖుబానీ కా మీటా, బడల్‌ కా మీటా, మలాయ్‌ కుల్ఫీ, ఇటాలియన్‌ ఫుడ్‌ కూడా మెనూలో పొందుపరిచారు. ఈ డిన్నర్‌లో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఫలక్‌నుమా ఫ్యాలెస్‌ అందాలకు మెస్సీ ముచ్చటపడ్డారు. ప్యాలెస్‌లో 101 మంది ఒకేసారి కూర్చొని భోజనం చేసే నిజాం డైనింగ్‌ టేబుల్‌ను చూసి ఆశ్చర్యపోయారు. హైదరాబాద్‌ ఆతిథ్యం మరిచిపోలేనిదని కితాబునిచ్చారు. 
 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)