ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు
Published on Fri, 08/23/2024 - 15:41
సాక్షి,హైదరాబాద్: రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్ర,శనివారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
రాజధాని హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుంది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
#
Tags : 1